Lata Mangeshkar : గాన గంధర్వుడు, గాన కోకిల.. బాలు, లతాల మధ్య అనుబంధం..

వీరిద్దరి మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది. లతా, బాలూలు ఇద్దరికీ కూడా ఏదైనా భాషలో పాట పాడాలి అంటే ఆ భాష నేర్చుకొని మరీ పాడేవారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సాంగ్స్ ఆలపించారు. గతంలో బాలూ........

Lata Mangeshkar :  గాన గంధర్వుడు, గాన కోకిల.. బాలు, లతాల మధ్య అనుబంధం..

Lathaji Balu

Bala Subrhmanyam :  గానకోకిలగా భారతదేశాన్ని తన పాటలతో మైమరిపించిన లతా మంగేష్కర్ ఇకలేరు. కరోనాతో జనవరి 11న ఆసుపత్రిలో చేరిన లతాజీ.. చికిత్స పొందుతూనే ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, ప్రేక్షకులు సంతాపం తెలుపుతూ శోక సంద్రంలో మునిగిపోయారు.

గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం కూడా గతంలో కరోనాతో హాస్పిటల్ లో చేరి మరణించారు. వీరిద్దరి మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది. లతా, బాలూలు ఇద్దరికీ కూడా ఏదైనా భాషలో పాట పాడాలి అంటే ఆ భాష నేర్చుకొని మరీ పాడేవారు. వీరిద్దరూ కలిసి ఎన్నో సాంగ్స్ ఆలపించారు.

లతా మంగేష్కర్‌ గోల్డెన్‌ పిరియడ్‌లో ఆమె పక్కన రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నాడే.. లాంటి ఎంతో మంది గ్రేట్ సింగర్స్ పాడారు. కానీ ఆవిడకి బాలు గారితో కలిసి ఆలపించడమే ఇష్టం అని చాలా సార్లు చెప్పారు. ఆయనతో పాడేటప్పుడు ఫుల్‌ ఎనర్జీ, జోష్‌తో పడతాను అని గతంలో తెలిపారు. వాళ్ళిద్దరి మధ్య తల్లీ కొడుకుల అనుబంధం ఉంది. బాలు గారిని లతాజీ ముద్దుల కొడుకుగా చూసేది. బాలు గారిని ప్రేమగా బాలాజీ అని పిలిచేది.

లతా మంగేష్కర్ తెలుగులో పాడిన మూడు పాటలు

గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది పాటలు పడటానికి ప్రమాదంగా మారుతుంది, వద్దు అని బాలుతో అన్నారు, ఆమెకి చెప్పకుండా బాలు ఆపరేషన్ జరిగినప్పుడు లతాజీ చాలా కంగారు పడ్డారు. ఈ విషయాలన్నీ బాల సుబ్రహ్మణ్యం గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలు గారి ప్రత్యేక ఆహ్వానం మీద లతాజి హైదరాబాద్‌ కి కూడా వచ్చారు.

Lata Mangeshkar : లతా మంగేష్కర్ అంతక్రియలకు హాజరు కానున్న పీఎం నరేంద్ర మోదీ

గతంలో ఒకసారి లతాజి చనిపోయారనే పుకార్లు వచ్చినప్పుడు.. వాటిని ఖండిస్తూ బాలూ స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఆమె త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆశించారు. కానీ ఆయన ముందు మరణించారు. బాలు మరణించినప్పుడు లతా మంగేష్కర్ అయన గురించి మాట్లాడుతూ.. ”ఆయన పాడే ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హఠాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్‌ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉండేది. ఒక విరుపో, నవ్వో, గమకమో.. ఇలా ఎదో ఒకటి తనకంటూ ప్రత్యేకంగా తీసుకొచ్చేవారు పాటలో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో లైవ్‌ కన్సర్ట్‌లలో పాల్గొన్నాను. స్టేజ్‌ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఆ పుకారు నిజమని తేలింది” అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు.

Lata Mangeshkar : భారత గాన కోకిల ‘లతా మంగేష్కర్’ మృతిపై సినీ ప్రముఖుల సంతాపం

భారత దేశాన్ని తమ పాటలతో ఉర్రూతలూగించిన గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం, గాన కోకిల లతా మంగేష్కర్ లేకపోవడం భారత సినీ సంగీత పరిశ్రమకి తీరని లోటు.