Lyrical Songs: షేక్ చేస్తోన్న సాంగ్స్.. సోషల్ మీడియాలో రికార్డుల మోత

ఇప్పుడు సాంగ్స్ ఎంత హిట్ అంటే కొలవాల్సింది సోషల్ మీడియాలోనే. వ్యూస్, లైక్స్ తోనే నెవర్ బిఫోర్ రికార్డులు కొట్టేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. ఇక్కడ బ్లాక్ బస్టర్ మార్క్ క్రాస్..

Lyrical Songs: షేక్ చేస్తోన్న సాంగ్స్.. సోషల్ మీడియాలో రికార్డుల మోత

Lyrical Songs(1)

Lyrical Songs: ఇప్పుడు సాంగ్స్ ఎంత హిట్ అంటే కొలవాల్సింది సోషల్ మీడియాలోనే. వ్యూస్, లైక్స్ తోనే నెవర్ బిఫోర్ రికార్డులు కొట్టేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. ఇక్కడ బ్లాక్ బస్టర్ మార్క్ క్రాస్ చేస్తే ఆటోమెటిక్ గా థియేటర్లొకొచ్చే బొమ్మపై ఎక్స్ పెక్టేషన్స్ ఫుల్ గా పెరుగుతాయి. ఇప్పుడిలానే సర్కారు వారి కళావతి పాట నంబర్ వన్ కి రీచయింది. కళావతి తర్వాత ప్లేసుల్లో ఉన్న టాలీవుడ్ మోస్ట్ లైక్డ్ సాంగ్స్ ఏంటో చూసేద్దాం.

Bheemla Nayak: ఓటీటీల పోటీ.. రికార్డు ధర పలికిన భీమ్లా నాయక్!

24 గంటల్లో హైయ్యెస్ట్ మార్క్ క్రాస్ చేస్తే ఆ మజానే వేరు. ప్రస్తుతం టాలీవుడ్ లిరికల్ సాంగ్స్ ఇలాంటి ఫీట్స్ తోనే హైలైట్ అవుతున్నాయి. వ్యూస్, లైక్స్ పరంగా నెవర్ బిఫోర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. రీసెంట్ గా బయటికొచ్చిన సర్కారు వారి పాట కళావతిని సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. అందుకే కేవలం 24 గంటల్లో 8లక్షల 8వేలను క్రాస్ చేసి కొత్త మార్క్ సెట్ చేసింది. లైక్స్ పరంగా టాలీవుడ్ టాప్ సాంగ్ గా యూట్యూబ్ రికార్డులలెక్కింది.

NBK107: ఆగని లీకులు.. బాలయ్య సినిమాకూ ఎఫెక్ట్!

కళావతి వచ్చే వరకు టాప్ పొజిషన్ లో ఉన్నాడు భీమ్లానాయక్. పవర్ స్టార్ భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ 24 గంటల్లో 8లక్షల 5వేల లైక్స్ ను రీచయింది. ప్రెజెంట్ మోస్ట్ లైక్డ్ లిరికిల్ సాంగ్ లిస్ట్ లో టాప్ 2గా భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ ఉంటే టాప్ 3 ప్లేస్ లో అదే మూవీ నుంచి లాలా భీమ్లా ట్రెండయింది. అయితే హైలో ఉన్న సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ ఈ రెండిటింకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కావడం ఓ స్పెషాలిటీ. ఏ రేంజ్ లో తమన్ ఇప్పుడు ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాడో అర్ధమవుతుంది.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా కెటిఆర్

మోస్ట్ లైక్డ్ లిస్ట్ లో పుష్ప నుంచి దాక్కో దాక్కో మేక టాప్ 4లో ఉంది. పుష్ప నుంచే ఊ అంటావా సాంగ్ 5వ స్థానంలో.. శ్రీవల్లి సాంగ్ 8వ స్థానాల్లో ఉన్నాయి. ఇక ట్రిపుల్ ఆర్ నాటు నాటు 6త్ ప్లేస్ లో, దోస్తీ సాంగ్ 7ప్లేస్ ను రిజర్వ్ చేసుకున్నాయి. ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి రిలీజైన ఈ రాతలే తొమ్మిదిలో నిలువగా.. ఇప్పటికీ టాప్ 10గా దూసుకుపోతుంది వకీల్ సాబ్ మగువ మగువ సాంగ్. మళ్లీ వీటిని బీట్ చేసే సాంగ్ వస్తే కానీ ఈ మోస్ట్ లైక్డ్ లిస్ట్ పోయి కొత్త లిస్ట్ తయారవదు.