Sonu Nigam : అప్పగింతల్లో స్టార్ సింగర్ ఎంట్రీ.. ఏడుపులు పోయి అందరి మొహాల్లోనూ నవ్వులు..

బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్‌ సడెన్ గా తెలియని వాళ్ళ ఓ పెళ్ళికి వెళ్లడంతో అక్కడున్న అతిథులు షాకయ్యారు. సోనూ నిగమ్ తన పర్సనల్ పని మీద ఇటీవల ఉజ్జయిని........

Sonu Nigam : అప్పగింతల్లో స్టార్ సింగర్ ఎంట్రీ.. ఏడుపులు పోయి అందరి మొహాల్లోనూ నవ్వులు..

Sonu

Sonu Nigam :  బాలీవుడ్ స్టార్ సింగర్ సోనూ నిగమ్‌ సడెన్ గా తెలియని వాళ్ళ ఓ పెళ్ళికి వెళ్లడంతో అక్కడున్న అతిథులు షాకయ్యారు. సోనూ నిగమ్ తన పర్సనల్ పని మీద ఇటీవల ఉజ్జయిని వెళ్ళాడు. అక్కడ ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేశాడు. అయితే ఉజ్జయినిలో ఉన్న ప్రముఖ ఆలయాలను దర్శించుకొని, తన పనులు అయ్యాక సాయంత్రంవేళ హోటల్‌కు తిరిగి వచ్చారు సోనూ నిగమ్. అయితే అదే టైంలో ఆ హోటల్ లో ఓ వివాహం జరుగుతుంది. దీంతో సోనూ వెంటనే ఆ వివాహానికి వెళ్లి అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచారు.

Pushpa : ‘పుష్ప’ వన్ మ్యాన్ షో.. బెనిఫిట్ షో ఫ్యాన్స్ రివ్యూ ఇదే..

అయితే సోనూ నిగమ్ ఆ వివాహం దగ్గరికి వెళ్లేసరికి అక్కడ అప్పగింతల కార్యక్రమం జరుగుతోంది. పెళ్లికూతురు, ఆమె తరపు బంధువులు ఏడుస్తున్న టైంలో సోనూ ఎంట్రీ ఇవ్వడంతో అందరి మొహాల్లోనూ చిరునవ్వులు వచ్చాయంట. అప్పటిదాకా బాధతో ఉన్న వాళ్ళు సోనూని చూడగానే హ్యాపీగా మారిపోయారు. సోనూ ఆ నూతన వధూవరులని ఆశీర్వదించాడు. సోను నిగమ్ ఇలా సడెన్ గా వచ్చి తమని ఆశీర్వదించడం మా పెళ్లి మాతో పాటు అందరికి స్పెషల్ గా గుర్తుండిపోతుంది అని ఆ కొత్త జంట అంటున్నారు.