Pawan Kalyan: పవన్, సాయి ధరమ్ తేజ్‌లపై స్పెషల్ సాంగ్..?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్లో క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.
Pawan Kalyan: మొదలైన పవన్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ సినిమా..!
కాగా, ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తాజాగా మరో సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. తమిళ నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతం’ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో పాటు మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఈ మామాఅల్లుళ్ల కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
Pawan Kalyan : పవన్ కి స్థలం ఇచ్చానని నా ఇల్లు కూలగొట్టారు.. ఇప్పటం గ్రామం పెద్దావిడ ఆవేదన
ఇక ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ కూడా చేశారు. కాగా, ఈ సినిమాలో పవన్, తేజ్‌లపై ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్‌లో ఈ ఇద్దరు హీరోలను ఎలివేట్ చేసే సీన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి నిజంగానే పవన్, తేజులపై స్పెషల్ సాంగ్ ఉండనుందా.. ఒకవేళ ఉంటే, ఈ పాట ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే అభిమానుల్లో క్రియేట్ అయ్యింది.