Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ ఎందుకు ఓట్లు వెయ్యట్లేదు? పవన్ కళ్యాణ్ ఏం సమాధానం ఇచ్చాడు?

పవన్ కి ఉన్న ఫ్యాన్న్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. కానీ గత ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడు. రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయాడు. పవన్ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా తక్కువే. దీనిపై బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తూ...............

Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ ఎందుకు ఓట్లు వెయ్యట్లేదు? పవన్ కళ్యాణ్ ఏం సమాధానం ఇచ్చాడు?

Pawan Kalyan spoke about why Janasena and him self getting not votes

Pawan Kalyan :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అయితే పవన్ కి ఉన్న ఫ్యాన్న్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. కానీ గత ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడు. రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయాడు. పవన్ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా తక్కువే. దీనిపై బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తూ.. నీకు స్టేట్ లో ఫ్యాన్ కాని వాడు ఎవడూ లేడు. మరి ఎందుకు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, అభిమానం ఓట్ల రూపంలో మారట్లేదు అని అడిగాడు.

Unstoppable : చిరంజీవి దగ్గర నుంచి పవన్ ఏం నేర్చుకున్నాడు? ఏం నేర్చుకోకూడదు అనుకున్నాడు?

దీనికి పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ.. అభిమానం వేరు, ఓట్లు వేరు. మనం ఇక్కడ ఒక పేరు సంపాదించుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. అలాగే సినిమా రంగం నుంచి రాజకీయ రంగం వెళ్లి అక్కడ నమ్మకం సంపాదించడానికి కూడా చాలా టైం పడుతుంది. అక్కడ నిలబడాలి. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. గతంలో ఎన్టీఆర్, MGR గారితో మాత్రమే ఇది త్వరగా సాధ్యమైంది. ఇంకెవరివల్ల కాలేదు. ఈ ప్రశ్నకి ఇంకో పదేళ్ల తర్వాత అడిగితే నా దగ్గర సమాధానం ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకా ప్రజల దగ్గర నమ్మకం సంపాదించే పనిలోనే ఉన్నాను. నాకు ఎప్పటికి అధికారం వచ్చినా రాకపోయినా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అని తెలిపారు.