Unstoppable : చిరంజీవి దగ్గర నుంచి పవన్ ఏం నేర్చుకున్నాడు? ఏం నేర్చుకోకూడదు అనుకున్నాడు?

ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని మీ అన్నయ్య పార్టీ పెట్టారు, చిరంజీవి దగ్గర్నుంచి రాజకీయాల్లో, పర్సనల్ గా ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోకూడదు అనుకున్నావు అని అడగడంతో పవన్ సమాధానమిస్తూ...........

Unstoppable : చిరంజీవి దగ్గర నుంచి పవన్ ఏం నేర్చుకున్నాడు? ఏం నేర్చుకోకూడదు అనుకున్నాడు?

pawan kalyan shares in Unstoppable show what he learning from chiranjeevi in personal and political life

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో సూపర్ గా సక్సెస్ అయింది. మొదటి సీజన్ గ్రాండ్ గా సక్సెస్ అవ్వడంతో రెండో సీజన్ కూడా మరింత గ్రాండ్ గా చేశారు. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ లో చంద్రబాబు, ప్రభాస్ ఎపిసోడ్స్ హైలెట్ గా నిలవగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లారు. బాలకృష్ణ-పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తామని ప్రకటించి పార్ట్ 1ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేశారు ఆహా. ఈ ఎపిసోడ్ ఎక్కువ స్ట్రీమింగ్ టైం సాధించి సరికొత్త రికార్డులని సెట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో సరదాగా మాట్లాడుతూ, సినిమాలు, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. తాజాగా ఫిబ్రవరి 9 గురువారం రాత్రి బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రిలీజ్ చేశారు.

బాలయ్య-పవన్ ఎపిసోడ్ షూటింగ్ మొదలైన దగ్గర్నుంచి అటు బాలయ్య అభిమానులు, ఇటు పవన్ అభిమానులు హంగామా చేశారు. వరుసగా పోస్టర్లు, ఫోటోలు, ప్రోమోలు.. వదులుతూ ఆహా టీం కూడా ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ అయిన పవన్ బాలయ్య ఎపిసోడ్ తో ఈ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. మొదటి పార్ట్ లో అంతా సినిమాలు, పర్సనల్ లైఫ్ ఉంటే రెండో పార్టీ లో చాలా వరకు పాలిటిక్స్ గురించి ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Arun Vijay : మరో తమిళ హీరోకి షూటింగ్‌లో ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫోటో!

ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని మీ అన్నయ్య పార్టీ పెట్టారు, చిరంజీవి దగ్గర్నుంచి రాజకీయాల్లో, పర్సనల్ గా ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోకూడదు అనుకున్నావు అని అడగడంతో పవన్ సమాధానమిస్తూ.. అన్నయ్య దగ్గర చిన్నప్పటినుంచి హార్డ్ వర్క్ నేర్చుకున్నాను. అన్నయ్య చాలా కష్టపడతాడు, కష్టపడమని చెప్తాడు. అలాగే అందరిని కలుపుకుపోవడం నేర్చుకున్నాను. ఇక అన్నయ్య కొన్ని విషయాల్లో మొహమాటపడతాడు. దాని వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆ మొహమాటం మాత్రం నేను ఉండకూడదు అనుకున్నాను. ఇక రాజకీయాల్లో అంటే విమర్శలు తీసుకోవాలి. అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు చాలా మంది విమర్శించారు, ఆ విమర్శలన్నిటిని తీసుకోగలగాలి. అది అన్నయ్య దగ్గర నుంచే నేర్చుకున్నాను. నన్ను ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు, ఆ విమర్శలని తీసుకోగలిగితేనే పాలిటిక్స్ లో ఉంటాం అని తెలిపాడు.