SPY Movie: సుభాష్ చంద్రబోస్ మిస్టరీని బయటపెట్టేందుకు రెడీ అయిన స్పై

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ ను తాజాగా అనౌన్స్ చేశారు.

SPY Movie: సుభాష్ చంద్రబోస్ మిస్టరీని బయటపెట్టేందుకు రెడీ అయిన స్పై

SPY Movie Announces Teaser And Release Dates

SPY Movie: యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్పై’ ఇప్పటిక ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే వెల్లడించింది. ఈ సినిమాలో నిఖిల్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే తెలపడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Spy Movie: నిఖిల్ ‘స్పై’ మూవీ డిజిటల్ రైట్స్‌కు భారీ రేటు..?

కాగా, ఈ సినిమా నుండి సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది చిత్ర యూనిట్. పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా, భారత్‌కు సంబంధించిన హిడెన్ స్టోరిని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను గ్యారీ డైరెక్ట్ చేస్తుండగా, నిఖిల్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ మిస్టరీని మనకు చూపించనున్నట్లుగా ఈ చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ మూవీని జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది.

Spy Movies: స్పైలుగా మారిపోతున్న హీరోలు.. హాలీవుడ్ జానర్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకో?

ఇక ఈ సినిమా టీజర్‌ను మే 12న రిలీజ్ చేస్తున్నట్లు స్పై టీమ్ వెల్లడించింది. ఈ సినిమా నుండి వచ్చిన తాజా అప్డేట్‌తో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ మూవీలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, కె.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజా అనౌన్స్‌మెంట్‌తో స్పై మూవీ మరోసారి నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.