Spy Movie: నిఖిల్ ‘స్పై’ మూవీ డిజిటల్ రైట్స్‌కు భారీ రేటు..?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన నెక్ట్స్ మూవీని కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘స్పై’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

Spy Movie: నిఖిల్ ‘స్పై’ మూవీ డిజిటల్ రైట్స్‌కు భారీ రేటు..?

Nikhil Siddharth Spy Movie Non-Theatrical Rights Sold For Huge Price

Spy Movie: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ మూవీని కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుతుండగా, ఈ చిత్రానికి ‘స్పై’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాను గ్యారీ బీహెచ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Spy Movies: స్పైలుగా మారిపోతున్న హీరోలు.. హాలీవుడ్ జానర్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకో?

ఇక ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో నిఖిల్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్, శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా కలిసి దాదాపు రూ.40 కోట్లతో సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Nikhil SPY : స్పై మూవీ నుంచి నిఖిల్ అఫీషియల్ లీక్..

నిఖిల్ సినిమాకు నాన్-థియేట్రికల్ రైట్స్ ఈ రేంజ్‌లో అమ్ముడు కావడం నిజంగా విశేషమని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో సాన్య థాకూర్‌, ఐశ్వర్య మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఈడి ఎంట‌ర్టైన‌మెంట్స్ ప‌తాకంపై రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చ‌ర‌ణ్ తేజ్ ఉప్పల‌పాటిలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.