Alluri : మరో అల్లూరి సీతారామరాజు.. శ్రీ విష్ణు కొత్త ప్రయోగం..

కొత్త కొత్త సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే శ్రీ విష్ణు తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. తన కొత్త సినిమా టైటిల్ ని 'అల్లూరి'గా ప్రకటించాడు. శ్రీవిష్ణు హీరోగా........

Alluri : మరో అల్లూరి సీతారామరాజు.. శ్రీ విష్ణు కొత్త ప్రయోగం..

 

Sree vishnu :  ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించి మెప్పించాడు. తెలుగు సినిమాల్లో ఈ పేరుకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తాజాగా అల్లూరి పేరుతో మరో సినిమా రాబోతుంది. కొత్త కొత్త సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే శ్రీ విష్ణు తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. తన కొత్త సినిమా టైటిల్ ని ‘అల్లూరి’గా ప్రకటించాడు.

Sai Manjrekar : తెలుగు హీరోలపై ‘గని’ హీరోయిన్ సయీ మంజ్రేకర్ వ్యాఖ్యలు..

శ్రీవిష్ణు హీరోగా, కయ్యదు లోహర్‌ హీరోయిన్ గా లక్కీ మీడియా పతాకంపై ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్‌ నిర్మాతగా ‘అల్లూరి’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని, ప్రీ లుక్ ని మాస్ మహారాజ రవితేజ రిలీజ్ చేశారు. ఇందులో శ్రీ విష్ణు పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించనున్నారు. రిలీజ్ చేసిన ప్రీ లుక్ అందర్నీ మెప్పిస్తుంది. శ్రీ విష్ణు మొదటి సారి పోలీస్ పాత్రలో నటించనుడటంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తారని చిత్ర యూనిట్ తెలిపారు.