Sreeleela : స్పెయిన్‌లో షూటింగ్‌కి వెళ్లి.. బ్యాగ్ పోగొట్టుకున్న హీరోయిన్

శ్రీలీల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి సందD సినిమా షూటింగ్ సమయంలోనే నాకు ధమాకా కథ చెప్పారు. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ కథ ఒప్పుకున్నాను. ధమాకా సినిమా షూటింగ్ టైంలో నాకు..............

Sreeleela : స్పెయిన్‌లో షూటింగ్‌కి వెళ్లి.. బ్యాగ్ పోగొట్టుకున్న హీరోయిన్

Sreeleela bag stolen in spain

Sreeleela :  కన్నడ భామ శ్రీలీల రాఘవేంద్రరావు చేతుల మీదుగా పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ఆ సినిమాతో మంచి విజయం అందుకొని ఒక్కసారిగా పాపులర్ అయింది. పెళ్లి సందD సినిమా తర్వాత శ్రీలీలకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీలీల చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి. రవితేజ సరసన శ్రీలీల నటించిన ధమాకా సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది.

దీంతో చిత్ర యూనిట్ తో పాటు శ్రీలీల కూడా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి, షూటింగ్ గురించి పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. ధమాకా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకుంది శ్రీలీల.

Namrata Shirodkar : మహేష్ కోసమే నేను సినిమాలు మానేశాను..

శ్రీలీల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పెళ్లి సందD సినిమా షూటింగ్ సమయంలోనే నాకు ధమాకా కథ చెప్పారు. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ కథ ఒప్పుకున్నాను. ధమాకా సినిమా షూటింగ్ టైంలో నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. స్పెయిన్ లో జింతాక పాత షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నా బ్యాగ్ పోయింది. కాస్ట్యూమ్స్ అన్ని అందులోనే ఉన్నాయి. ఇక నా కోసం మా కెమెరామెన్, డైరెక్టర్ స్పెయిన్ లో చాలా దూరం ట్రావెల్ చేసి షాపింగ్ చేశారు. అక్కడ వాటిని ఫోటోలు తీసి నాకు వాట్సాప్ లో పంపి అలా ఓకే చేసుకొని కొనుక్కున్నాం. నా కోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు అని తెలిపింది.