Namrata Shirodkar : మహేష్ కోసమే నేను సినిమాలు మానేశాను..
వివాహం తర్వాత నమ్రతా సినిమాలు మానేసింది. సినిమాలు మానేసినా మహేష్ భార్యగా, పలు వ్యాపారాలతో ఎప్పుడూ సెలబ్రిటిగా, బిజీగానే ఉంది. తాజాగా చాలా రోజుల తర్వాత నమ్రతా ఓ యూట్యూబ్ ఛానల్ కి..............

why Namrata Shirodkar leaves movies
Namrata Shirodkar : మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది నమ్రతా శిరోద్కర్. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో మహేష్ సరసన వంశీ సినిమాలో నటించింది. ఆ సమయంలోనే మహేష్-నమ్రతా ప్రేమలో పడ్డారు. కొన్నేళ్లు ప్రేమించుకొని అనంతరం 2005లో వివాహం చేసుకున్నారు.
అయితే వివాహం తర్వాత నమ్రతా సినిమాలు మానేసింది. సినిమాలు మానేసినా మహేష్ భార్యగా, పలు వ్యాపారాలతో ఎప్పుడూ సెలబ్రిటిగా, బిజీగానే ఉంది. తాజాగా చాలా రోజుల తర్వాత నమ్రతా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలని తెలిపింది. ఈ నేపథ్యంలో తను సినిమాలు ఎందుకు మానేసిందో కూడా చెప్పింది.
Veera Simha Reddy : “మా బావ మనోభావాలు” అంటున్న బాలయ్య..
నమ్రతా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మహేష్ తో ప్రేమలో ఉన్నప్పుడే చెప్పాడు పెళ్లి అయిన తర్వాత నేను కష్టపడటం వద్దన్నాడు, సినిమాలు ఆపేయాలని కోరాడు. నేను మా అమ్మ కోసమే మోడలింగ్ లోకి వచ్చి ఇలా సినిమాల్లోకి వచ్చాను. మహేష్ సినిమాలు ఆపేయమనడంతో నేను తన కోసం ఓకే చెప్పాను. అందుకే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించలేదు. ముంబైలో మాది ఒక మాములు అపార్ట్మెంట్. పెళ్లి తర్వాత మహేష్ వాళ్ళ పెద్ద ఇంటికి వెళ్తే అక్కడ ఉండలేకపోయాను. అందుకే కొన్ని రోజులు నా కోసం మహేష్ అపార్ట్మెంట్ లో కూడా ఉన్నాడు అని తెలిపింది.