Sreeleela: క్రేజీ ఆఫర్లు.. కన్నడ బ్యూటీకి మరో జాక్‌పాట్!

స్టార్ హీరోల సినిమాల్లో ఓ యంగ్ హీరోయిన్ పేరు బాగా చక్కర్లు కొడుతుంది. ఒక్క సినిమాతో గ్లామర్ ముద్ర వేయించుకుని సందడి షురూ చేసిన ఈ కన్నడ కస్తూరి శ్రీలీల.. ఇప్పటికే కొన్ని..

Sreeleela: క్రేజీ ఆఫర్లు.. కన్నడ బ్యూటీకి మరో జాక్‌పాట్!

Sreeleela

Sreeleela: స్టార్ హీరోల సినిమాల్లో ఓ యంగ్ హీరోయిన్ పేరు బాగా చక్కర్లు కొడుతుంది. ఒక్క సినిమాతో గ్లామర్ ముద్ర వేయించుకుని సందడి షురూ చేసిన ఈ కన్నడ కస్తూరి శ్రీలీల.. ఇప్పటికే కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలకు సైన్ కూడా చేసింది. అయితే అన్నింటికి మించి అన్న రేంజ్ లో ప్రభాస్, మహేశ్ లాంటి స్టార్ హీరోల సినిమాలలో కూడా ఫిక్స్ అంటూ వస్తున్న కథనాలు ఆసక్తిగా వినిపిస్తున్నాయి. శ్రీలీల.. పెళ్లి సందడి సినిమాతో గ్లామర్ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ కన్నడ సోయగం.

Sreeleela: కవ్విస్తున్న కన్నడ లేత సోయగం శ్రీలీల!

ఈ ఒక్క సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపుకు తిప్పుకుని వరుసగా సినిమాలకు సైన్ చేస్తుంది శ్రీలీల. ప్రస్తుతం ధమాకా మూవీలో రవితేజ సరసన నటిస్తోంది. అయితే రీసెంట్ గా ప్రభాస్, మహేశ్ బాబు లాంటి హీరోల సినిమాల్లో శ్రీలీల ఛాన్స్ కొట్టేసిందంటూ ప్రచారం ఫుల్ గా ఊపందుకుంది. ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో రాజా డీలక్స్ తెరకెక్కనుందనే వార్తలొస్తున్నాయి. ఈ హారర్ మూవీలో ప్రభాస్ సరసన శ్రీలీలను ఒక హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టు చెప్తున్నారు.

Sreeleela: లక్కీ గర్ల్ శ్రీలీల.. రెబల్ స్టార్‌తో జతకట్టే ఛాన్స్?

అటు మహేశ్-త్రివిక్రమ్ కాంబో మూవీలో శ్రీలీలకు ఓ క్రేజీ రోల్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. నవీన్ పొలిశెట్టి, వైష్ణవ్ తేజ్ సినిమాలతో పాటు వైజయంతీ మూవీస్ నిర్మించే సినిమాలో మరోసారి రోషన్ తో రొమాన్స్ చేయనుందని చెప్తున్నారు. ఇవే కాదు.. యంగ్ హీరోలలో మరో స్టార్ హీరో.. కరోనా టైంలో కూడా వరసపెట్టి సినిమాలు తెస్తున్న మాసివ్ హీరో నితిన్ కు జంటగా కూడా శ్రీలీల ఫైనల్ అయినట్లు ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మరో గాసిప్.

Sreeleela : త్రివిక్రమ్, మహేష్ సినిమాలో ‘పెళ్లి సందD’ హీరోయిన్??

ప్రస్తుతం ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా చేస్తున్న నితిన్ ఇది పూర్తయ్యాక రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ వక్కంతం వంశీతో మరో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా న‌టించ‌నుందట. దాదాపు ఆమెను ఫైనల్ చేశారని త్వ‌ర‌లోనే దీనిపై ఓ ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చే అవకాశముందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప‌క్కా ఎంట‌ర్ టైన‌ర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి జూనియ‌ర్ అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.