Sreeleela: లక్కీ గర్ల్ శ్రీలీల.. రెబల్ స్టార్‌తో జతకట్టే ఛాన్స్?

ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శ్రీకాంత్-ఊహల కుమారుడు రోష‌న్ కుమార్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన సినిమా ‘పెళ్లి సందD’. గ‌త ఏడాది ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ఈ..

Sreeleela: లక్కీ గర్ల్ శ్రీలీల.. రెబల్ స్టార్‌తో జతకట్టే ఛాన్స్?

Sreeleela

Sreeleela: ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్రరావు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో శ్రీకాంత్-ఊహల కుమారుడు రోష‌న్ కుమార్ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా వచ్చిన సినిమా ‘పెళ్లి సందD’. గ‌త ఏడాది ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం కాలేదు. కానీ ఈ సినిమాతో హీరోయిన్ శ్రీలీలకి తెలుగులో మంచి పేరు వచ్చింది. శ్రీలీల గతంలో కన్నడలో కూడా సినిమాలు చేయగా.. ‘పెళ్లి సందD’ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దీంతో ‘పెళ్లి సందD’ తర్వాత శ్రీలీలకి వరుస సినిమా వకాశాలు వచ్చాయి.

Mahesh-Prabhas: రికార్డ్ వ్యూస్.. వాలంటైన్ డేను సంబరంగా మార్చిన స్టార్స్

శ్రీలీల ప్ర‌స్తుతం ర‌వితేజ‌తో ‘ధ‌మాకా’లో నటిస్తుండగా.. వాలంటైన్స్ డే సందర్భంగా శ్రీలీల పోస్టర్ కూడా రిలీజ్ చేసింది ధమాకా యూనిట్. దీంతో పాటుగా న‌వీన్ పొలిశెట్టి ‘అన‌గ‌న‌గా ఒక‌రాజు’ సినిమాలో కూడా న‌టిస్తున్న శ్రీలీలకు తాజాగా మరో భారీ బంపర్ ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో నేషనల్ వైడ్ స్టార్ గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ తో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు మాత్రమే ఛాన్స్ దక్కుతుంది. అలాంటిది శ్రీలీలకి ప్రభాస్ తో జతకట్టే ఛాన్స్ దక్కినట్లు తాజా టాక్ నడుస్తుంది.

SSMB28: మహేష్-త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ.. పవర్ ఫుల్ పాత్రలో మోహన్ లాల్!

ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల లిస్ట్ లో తెలుగు దర్శకుడు మారుతీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. మారుతీ కూడా ఈ వార్తల గురించి పూర్తిగా ఖండించకపోవడంతో నిజమేనని కన్ఫర్మ్ అయింది. రాజా డీలక్స్ అనే వర్కింగ్ టైటిల్ తో హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరో సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని కూడా వినిపిస్తోంది. ఆ ముగ్గురిలో శ్రీలీల కూడా ఒక హీరోయిన్ గా చర్చలు జరుగుతున్నాయట. అదే నిజమైతే శ్రీలీల స్టార్ తిరిగినట్లే. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శ్రీలీలకి ఈ సినిమా దక్కితే బంపర్ ఆఫర్ దక్కినట్లే!