Divyendu Sharma: ‘పెద్ది’ ఒక గొప్ప కథ.. ఆయన కోసం ఏదైనా చేయాలనుకున్నా.. దివ్యేందు శర్మ ఆసక్తికర కామెంట్స్
దర్శకుడు బుచ్చిబాబుపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటుడు దివ్యేందు శర్మ(Divyendu Sharma).
Actor Divyendu Sharma praise on director Buchi Babu.
- రామ్ చరణ్ ‘పెద్ది’ జూన్ 4న విడుదల.
- బుచ్చిబాబుపై దివ్యేందు శర్మ ప్రశంసలు.
- కథలోని ట్విస్ట్‌లు చాలా అద్భుతం.
Divyendu Sharma: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ(Divyendu Sharma) ఒక కీలక పాత్రలో నటించారు. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో, చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్న దివ్యేందు శర్మ దర్శకుడు బుచ్చిబాబు మేకింగ్ స్టైల్‌పై, ఆయన వ్యక్తిత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.
Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు వైరల్
తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తాను ఉత్తరాఖండ్‌లో వేరే షూటింగ్లో ఉన్నప్పుడు ‘పెద్ది’ టీమ్ నుండి పిలుపు వచ్చిందని పేర్కొన్నారు. ఆ తర్వాత బుచ్చిబాబు కథపై ఉన్న నమ్మకంతో తనను కలవడానికి పదే పదే మెసేజ్‌లు చేశారని, దాంతో ఆ షూటింగ్‌ను మధ్యలోనే ఆపి ఎంతో కష్టపడి ప్రయాణించి ఆయనను కలిశానని చెప్పారు. బుచ్చిబాబు చూపించిన ప్రేమ, కళ పట్ల ఆయనకున్న గౌరవం చూసి సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కేవలం ఆయన కోసమైనా ఈ ప్రాజెక్ట్ చేయాలని అక్కడికక్కడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశానని దివ్యేందు శర్మ వెల్లడించారు.
ఇక ‘పెద్ది’ కథాంశం గురించి వివరిస్తూ.. స్క్రిప్ట్ విన్నప్పుడు తాను పూర్తిగా షాక్‌కు గురయ్యానని, కథలో ఎన్నో ఊహించని ట్విస్ట్‌లు, అద్భుతమైన క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయని కొనియాడారు. సమాజంలో గుర్తింపు కోసం ఒక వ్యక్తి ఎంతటి యుద్ధానికైనా వెనుకాడకూడదనే పాయింట్ ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించబడింది అన్నారు. తన స్వంత గుర్తింపు కోసం ‘పెద్ది’ చేసే సుదీర్ఘమైన పోరాటం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని, ఈ ఎమోషనల్ పాయింట్ తనకు ఎంతో నచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
