Epic: ఎపిక్ నుంచి ‘ప్రియసఖి’ సాంగ్.. హేషామ్ మ్యూజికల్ మ్యాజిక్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ మెలోడీ
ఎపిక్(Epic) సినిమా నుంచి రెండో సాంగ్ విడుదల చేసిన మేకర్స్.
Anand Deverakonda Epic movie Priya sakhi Song released
- ఆనంద్, వైష్ణవిల ‘ఎపిక్’ చిత్రం.
- ‘ప్రయాసఖి’ రెండో పాట విడుదల.
- హేషామ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్.
Epic: ‘బేబీ’ వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలయికలో వస్తున్న సరికొత్త చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ (EPIC: First Semester). ట్రెండ్ సెట్టింగ్ వెబ్ సిరీస్ ’90’స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘బేబీ’ హిట్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.. ఫొటోలు వైరల్
తాజాగా ఈ సినిమా నుండి ‘ప్రియసఖి’ అనే రెండో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన ఈ మెలోడీ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటూ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సురేష్ బానిసెట్టి అందించిన అద్భుతమైన సాహిత్యం ఈ పాటను ఇన్‌స్టంట్‌గా వైరల్ చేశాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
యూత్‌ఫుల్ అండ్ మోస్ట్ రిలేటబుల్ మిడిల్ క్లాస్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలోనే ఈ లవ్లీ ఎంటర్టైనర్ థియేటర్లలో విడుదల కానుంది.
