Sekhar Master: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్(Sekhar Master) తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన భార్య సుజాత, కుమార్తె సాహితి, కుమారుడు విన్నీలతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సాంప్రదాయ దుస్తులలో మెరిసిన శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.









