Scholarship : విద్యార్థులకు ఊరట.. స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంచిన ప్రభుత్వం.. ఇదే లాస్ట్ ఛాన్స్..
Scholarship : తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు ఊరటనిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కాలర్ షిప్ కోసం రిజిస్ట్రేషన్ గడువును ఈనెలాఖరు వరకు పెంపు..
Scholarship
- తెలంగాణలోని విద్యార్థులకు ఊరట
- స్కాలర్షిప్ ధరఖాస్తు గడువు పెంపు
- మే31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
Scholarship : తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు ఊరటనిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్లో ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్షిప్ల మంజూరుకోసం కళాశాలలు, విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే చివరి తేదీని మే 31 వరకు ప్రభుత్వం పొడిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సబ్యసాచి ఘోష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపకార వేతనాల ప్రక్రియను పారదర్శకంగా అమలు చేసేందుకు వీలుగా 2025-26 విద్యా సంవత్సరంలో రిజిస్ట్రేషన్ గతేడాది జులై 1న ప్రారంభంకాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగుల నుంచి 10,89,265 మందికి గాను 10,20,688 మంది మాత్రమే నమోదయ్యారు.
గతేడాది నమోదు కంటే ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 68,597 తక్కువ ఉంది. సాంకేతిక సమస్యల కారణంగా ఆ విద్యార్థులు నిర్ణీత తేదీలోపు తమ దరఖాస్తును నమోదు చేసుకోలేక పోయినట్లు అధికారులు గుర్తించారు.
కాలేజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి ఎంఎస్సీ (నర్సింగ్), ఎంపీటీ, ఎన్ పీహెచ్, ఎన్ పీసీసీ, ఎన్ పీఎం తదితర కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. అయితే, సెట్ డేటా ఇంకా ఈపాస్ వెబ్ సైట్ కు అప్లోడ్ కాలేదు. అన్ని విషయాలనేు దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల సౌలభ్యం కోసం మరోసారి రిజిస్ట్రేషన్ గడువును పొడిగించినట్లు సబ్యసాచి ఘోష్త తెలిపారు.
