SSMB28: మహేష్ మూవీ రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ.. ఎప్పుడంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకునేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ కథతో తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

SSMB28: మహేష్ మూవీ రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ.. ఎప్పుడంటే..?

SSMB28 Release Clarity By Naga Vamsi

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకునేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ కథతో తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

SSMB28 : తమన్ పై మహేష్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్లు.. కౌంటర్ ఇచ్చిన తమన్!

కాగా, ఈ సినిమాను తొలుత ఏప్రిల్ నెలలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించినా, సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా కాకపోవడంతో ఈ రిలీజ్‌ను దసరాకు వాయిదా వేశారు. ఇక దసరా నాటికి ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేసి, పండగ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ దసరా రిలీజ్ కూడా డౌటే అంటున్నారు. దీనికి కారణం చిత్ర నిర్మాత నాగవంశీ ఈ సినిమా రిలీజ్ ఆగస్టులో ఉంటుందని తాజాగా వెల్లడించడమే.

SSMB28 : సంక్రాంతే కాదు.. దసరాకి కూడా పోటీయే!

మహేష్ బాబుతో సినిమా విషయంలో ఎలాంటి తొందరపాటు వద్దని చిత్ర యూనిట్ ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.