OTT Releases: థియేటర్‌లో స్టార్ మూవీస్.. అయినా తగ్గని ఓటీటీలు!

ఈ వారం స్టార్ హీరోల మూవీస్‌తో ధియేటర్లు బిజీగాఉంటే.. ఓటీటీలు కూడా ఏమాత్రం తగ్గకుండా సిరీస్లు, సినిమాలు ప్లాన్ చేశాయి. సూపర్ హిట్ మూవీస్ నుంచి సూపర్ ఎక్సైటింగ్ సిరీస్ తో వీకెండ్..

OTT Releases: థియేటర్‌లో స్టార్ మూవీస్.. అయినా తగ్గని ఓటీటీలు!

Ott Releases

OTT Releases: ఈ వారం స్టార్ హీరోల మూవీస్‌తో ధియేటర్లు బిజీగాఉంటే.. ఓటీటీలు కూడా ఏమాత్రం తగ్గకుండా సిరీస్లు, సినిమాలు ప్లాన్ చేశాయి. సూపర్ హిట్ మూవీస్ నుంచి సూపర్ ఎక్సైటింగ్ సిరీస్ తో వీకెండ్ కి రెడీ అవుతున్నాయి. హిందీలో సూపర్ హిట్ అయిన కామెడీ సీరియల్ తారక్ మెహతా కా ఉల్టా చష్మా సీరియల్ ని హిందీలో యానిమేషన్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఫిబ్రవరి 24 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సూపర్ కామిక్ యానిమేటెడ్ టీవీ షో అవైలబుల్ గా ఉంటోంది.

OTT Series: క్రైమ్ క్రేజ్.. ఓటీటీల్లో విశ్వరూపం చూపిస్తున్న హీరోయిన్లు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ లీడ్ రోల్ లో కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో గ్రాండ్ గా తెరకెక్కిన సిరీస్ ద ఫేమ్ గేమ్. సూపర్ స్టార్ గా కంటిన్యూ అవుతూ.. సడెన్ గా ఎవరికీ కనిపించకుండా మిస్ అయిపోయే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మిస్టరీ డ్రామా నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమ్అవుతోంది. బాబీ డియోల్, విక్రాంత్ మెస్సీ, సాన్యా మల్హోత్రా లీడ్ రోల్స్ లో తెరకెక్కిన లవ్ హాస్టల్ మూవీ ఫిబ్రవరి 25న జీ 5లో రిలీజ్ అవుతోంది. క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో బాబీ డియోల్ లవర్స్ ని దారుణంగా చంపేసే.. కంప్లీట్ నెగెటివ్ రోల్ లో కనిపిస్తున్నారు.

Bigg Boss OTT Telugu: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ప్రోమో రిలీజ్

తెలుగు ఓటీటీ యాప్ ఆహాలో ఈ ఫ్రైడే కూడా మరో ఇంట్రస్టింగ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. హర్ష, సిమ్రన్ చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కి ధియేటర్లో రిలీజ్ అయిన సెహరి మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ క్రేజీ కామెడీ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 25న ఆహా ఆడియన్స్ ముందుకొస్తోంది. మర్డర్ మిస్టరీ దృశ్యం కి సీక్వెల్ గా వచ్చిన కన్నడ దృశ్య 2 ఓటీటీలో రిలీజ్ అవుతోంది. రవిచంద్రన్ లీడ్ రోల్ లో శివ గణేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సూపర్ థ్రిల్లింగ్ రీమేక్ దృశ్య 2 జీ5 ఓటీటీలో ఫిబ్రవరి 25నుంచి అవైలబుల్ గా ఉంటోంది.

Movie Releases: ఈ వారం ధియేటర్లో ఎంటర్‌టైన్మెంట్ మోత!

రియాల్టీ షో కా బాప్ అంటూ కంగనా తెగ ప్రమోషన్లుచేస్తున్న ఏక్తాకపూర్ కాంట్రవర్షియల్ షో లాకప్. సెలబ్రిటీస్ తో రియాలిటీ గేమ్ షో కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ షో హిందీలో బాలాజీ, ఎమ్ ఎక్స్ ప్లేయర్ ఓటీటీ ల్లో ఫిబ్రవరి 27 ఆదివారం నుంచి టెలికాస్ట్ అవ్వడానికి రెడీ అవుతోంది.