Movie Releases: ఈ వారం ధియేటర్లో ఎంటర్‌టైన్మెంట్ మోత!

ఈ వారం ఎండ్ లెస్ ఎంటర్ టైన్ మెంట్ కి రెడీ అవుతున్నారు ఆడియన్స్. అటు ధియేటర్లలో బిగ్ వార్ జరగబోతుంది. ఈ వారం అటు ధియేటర్లో ఎంటర్ టైన్ మెంట్ మోత మోగిపోనుంది. వరసగా రిలీజ్ అవుతున్న..

Movie Releases: ఈ వారం ధియేటర్లో ఎంటర్‌టైన్మెంట్ మోత!

Movie Releases

Movie Releases: ఈ వారం ఎండ్ లెస్ ఎంటర్ టైన్ మెంట్ కి రెడీ అవుతున్నారు ఆడియన్స్. అటు ధియేటర్లలో బిగ్ వార్ జరగబోతుంది. ఈ వారం అటు ధియేటర్లో ఎంటర్ టైన్ మెంట్ మోత మోగిపోనుంది. వరసగా రిలీజ్ అవుతున్న సినిమాలు ఆడియన్స్ ని ఫుల్ ఎంగేజ్ అవ్వబోతున్నారు. ఈ వారం ఫుల్ స్పీడ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు స్టార్ హీరో అజిత్. రేసింగ్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతున్న వలిమై సినిమాలో అజిత్ హీరోగా, కార్తికేయ విలన్ గా నటిస్తున్నారు. బోనీ కపూర్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో గురువారం గ్రాండ్ గా ధియేటర్లో రిలీజ్ అవుతోంది.

RRR: దుబాయ్‌లో ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా హాలీవుడ్ యాక్షన్ హీరో?

అసలు సిసలు ఎంటర్ టైన్ మెంట్ పవన్ కళ్యాణ్ ఇవ్వబోతున్నారు. అన్న ఎంట్రీ ఇస్తే.. వార్ వన్ సైడే అని డిసైడ్ అయిన మిగతా సినిమాలన్నీ ఇప్పటికే భీమ్లా దెబ్బకు పోస్ట్ పోన్ అయ్యాయి. ఎందుకైనా మంచిదని ఫిబ్రవరి 25, మార్చి 4.. రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన భీమ్లానాయక్.. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు రావడానికే డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో సాగర్ చంద్ర డైరెక్షన్లో తెరకెక్కిన భీమ్లానాయక్ భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఫిబ్రవరి 25న ధియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Varun Tej: భీమ్లా ఎఫెక్ట్.. మరోసారి వాయిదా పడ్డ గని!

ఫిబ్రవరి 25నే రిలీజ్ అవుతోంది ఆలియా భట్ గంగూ భాయ్ సినిమా. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సోలో హీరోయిన్ సినిమా.. కోవిడ్ తోపోస్ట్ పోన్ అయ్యింది. అన్ని ఇబ్బందులు దాటుకుని ఫిబ్రవరి 25న ధియేటర్లో హిందీ, తెలుగులో రిలీజ్ అవుతోంది గంగూ భాయ్ సినిమా. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో అజయ్ దేవ్ గన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న గంగూభాయ్ లో ఆలియా సెక్స్ వర్కర్ గా బోల్డ్ రోల్ లో కనిపించబోతోంది.