Varun Tej: భీమ్లా ఎఫెక్ట్.. మరోసారి వాయిదా పడ్డ గని!

అనుకున్నట్లే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెనక్కు తగ్గాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన గని సినిమా మరోసారి వాయిదా పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ఫిక్స్..

Varun Tej: భీమ్లా ఎఫెక్ట్.. మరోసారి వాయిదా పడ్డ గని!

Varun Tej

Updated On : February 22, 2022 / 2:20 PM IST

Varun Tej: అనుకున్నట్లే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెనక్కు తగ్గాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన గని సినిమా మరోసారి వాయిదా పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న ఫిక్స్ చేసుకోవడంతో ఆ డేట్ కి ఇచ్చిన సినిమాలన్నీ ఒక్కొకటిగా వాయిదా వేసుకున్నారు. ముందుగా శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పోస్ట్ పోన్ చేసుకోగా కిరణ్ సబ్బవరం సెబాస్టియన్ కూడా వాయిదా ప్రకటన ఇచ్చారు.

Bheemla Nayak : తమన్‌ని ట్రోల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్.. అన్నీ థియేటర్లోనే అంటున్న తమన్

ఇక ఈరోజు వరకు కూడా వద్దామా వద్దా అనుకుంటూ ఎదురుచూసిన వరుణ్ తేజ్ గని కూడా వాయిదా పడినట్లుగా మంగళవారం ప్రకటన ఇచ్చారు. వాయిదా అయితే వేశారు కానీ మళ్ళీ కొత్త డేట్ మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే కొత్త డేట్ ప్రకటిస్తామంటూ సోషల్ మీడియాలో దర్శక, నిర్మాతలు ప్రకటించారు. అందరి అభిమానులులాగానే తాము కూడా తెర మీద పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్నామని.. భీమ్లా నాయక్ సినిమా కోసమే తాము పక్కకి తప్పుకున్నట్లు గని మేకర్స్ తెలిపారు.

Bheemla Nayak: రానా కోసం పవన్ కళ్యాణ్‌ని వాడుకున్నారు.. భీమ్లా నాయక్‌పై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!

సో మొత్తంగా ఈ వారంలో భీమ్లా నాయక్ ఒక్కడే వన్ అండ్ ఓన్లీగా థియేటర్లలో దిగనుండగా సోలోగా కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. భీమ్లా నాయక్ సౌత్ తో పాటు హిందీలో కూడా విడుదల చేయనుండగా ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. మరి భీమ్లా గర్జన ఎలా ఉంటుందో చూడాలిక.