Sukumar: శిష్యుడి సినిమాపై గురువు కామెంట్.. సంతోషంతో పాటు గర్వంగా ఉందన్న సుకుమార్!

యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాపై స్టార్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా స్పందించాడు.

Sukumar: శిష్యుడి సినిమాపై గురువు కామెంట్.. సంతోషంతో పాటు గర్వంగా ఉందన్న సుకుమార్!

Sukumar Feels Proud Of Dasara Movie

Sukumar: దసరా.. ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మూవీ. నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్‌లు జంటగా నటించిన ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్, దసరా మూవీని పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుండే కాకుండా పలువురు స్టార్స్ దగ్గర్నుండి కూడా ప్రశంసల వర్షం దక్కుతోంది.

Sukumar Assistants : టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌లు ఇస్తున్న సుకుమార్ స్టూడెంట్స్.. వీళ్లంతా సుకుమార్ శిష్యులే..

ఇటీవల స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ఈ సినిమాపై తనదైన కామెంట్స్ చేశారు. దసరా లాంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషంగా ఉందని ఆయన చిత్ర టీమ్‌ను అభినందించాడు. ఇక తాజాగా శ్రీకాంత్ ఓదెల గురువు అయిన సుకుమార్ దసరా మూవీపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దసరా సినిమాను చూసి సంతోషంతో పాటు గర్వంగా ఫీల్ అవుతున్నానని సుకుమార్ తెలిపాడు. తన విజువల నెరేషన్‌తో తనను వీర్లపల్లిలోకి తీసుకెళ్లిన విధానానికి తాను మంత్రముగ్ధుడనయ్యానంటూ సుకుమార్ సంతోషాన్ని వెల్లడించాడు.

Dasara Movie: దసరా టీమ్ పై బొమ్మ బొంబాట్ అంటూ జక్కన్న ప్రశంసల వర్షం

ధరణి పాత్రకు నాని తనను తాను సరెండర్ చేసుకున్న తీరు.. నాని ప్రతిసారి అతడి ప్రతిభతో తనను సర్‌ప్రైజ్ చేస్తాడని.. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ మెరిసిన తీరు.. సూరి పాత్రలో దీక్షిత్ శెట్టి అదరగొట్టాడంటూ సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా ఇంత బాగా రావడానికి కృషి చేసిన ప్రతి టెక్నీషియన్‌కు తన అభినందనలు తెలిపాడు సుకుమార్. ఇలా తన శిష్యుడి సినిమాపై సుకుమార్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.