Sukumar Assistants : టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌లు ఇస్తున్న సుకుమార్ స్టూడెంట్స్.. వీళ్లంతా సుకుమార్ శిష్యులే..

సుకుమార్ ఎంతటి ట్యాలెంట్ డైరెక్టర్ అనేది అందరికి తెలుసు. కెరీర్ మొదట్లో లవ్ సినిమాలతో మెప్పించిన సుకుమార్ ఇప్పుడు మాస్, కమర్షియల్ సినిమాలతో అదరగొడుతున్నాడు. సుకుమార్ బాటలోనే ఆయన శిష్యులు కూడా ఇప్పుడు టాలీవుడ్ ని ఏలేయడానికి వస్తున్నారు.

Sukumar Assistants : టాలీవుడ్‌లో సూపర్ సక్సెస్‌లు ఇస్తున్న సుకుమార్ స్టూడెంట్స్.. వీళ్లంతా సుకుమార్ శిష్యులే..

Sukumar Assistants entry in Tollywood and impress with their first movies

Updated On : April 3, 2023 / 10:09 AM IST

Sukumar Assistants :  టాలీవుడ్(Tollywood) గత కొంతకాలంగా ఫుల్ సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ మాత్రమే కాదు కొత్త డైరెక్టర్స్, యువ హీరోలు కూడా సూపర్ హిట్స్ కొడుతూ, మంచి సినిమాలు ఇస్తున్నారు. మొదటి సినిమాతో వచ్చే ప్రతి డైరెక్టర్(Director) చాలా వరకు కచ్చితంగా ఏదో ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసే వస్తారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసి, చాలా విషయాలు నేర్చుకొని మంచి సినిమాతో ముందుకొస్తారు కొత్త డైరెక్టర్స్.

ఇటీవల వచ్చిన కొంతమంది కొత్త డైరెక్టర్స్ మొదటి సినిమాతోనే మంచి విజయాలు అందుకొని టాలీవుడ్ లో స్థానం సంపాదించుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది సుకుమార్ శిష్యులు ఇప్పుడు డైరెక్టర్స్ గా ఎంట్రీ ఇస్తూ అదరగొడుతున్నారు. సుకుమార్ ఎంతటి ట్యాలెంట్ డైరెక్టర్ అనేది అందరికి తెలుసు. కెరీర్ మొదట్లో లవ్ సినిమాలతో మెప్పించిన సుకుమార్ ఇప్పుడు మాస్, కమర్షియల్ సినిమాలతో అదరగొడుతున్నాడు. సుకుమార్ బాటలోనే ఆయన శిష్యులు కూడా ఇప్పుడు టాలీవుడ్ ని ఏలేయడానికి వస్తున్నారు.

ఇటీవల నాని, కీర్తి సురేష్ జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా భారీ విజయం సాధించింది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్, బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. దసరా సినిమా చూస్తే అసలు ఓ కొత్త డైరెక్టర్ తీసినట్టు అనిపించదు. కానీ శ్రీకాంత్ ఓదెలకు డైరెక్టర్ గా ఇదే మొదటి సినిమా. అంతకు ముందు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు శ్రీకాంత్.

ఇక వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ ఉప్పెన సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ బుచ్చిబాబు సాన. మొదటి సినిమాతో, కొత్త హీరో, హీరోయిన్స్ తోనే 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సూపర్ ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. ఇతను కూడా సుకుమార్ దగ్గరా చాలా ఏళ్ళ నుంచి దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇప్పుడు ఏకంగా రామ చరణ్ తో సినిమా తీయబోతున్నాడు బుచ్చిబాబు.

Balagam : మరో నేషనల్ అవార్డు గెలుచుకున్న బలగం.. ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నాం.. ప్రియదర్శి స్పెషల్ పోస్ట్..

ఇటీవల నిఖిల్, అనుపమ జంటగా వచ్చిన 18 పేజిస్ మంచి విజయం సాధించింది. లవ్ డ్రామాగా ఈ సినిమాని పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించాడు. ఇతను చాలా ఏళ్ళ క్రితమే కరెంట్, కుమారి 21F సినిమాలతో ప్రేక్షకులని మెప్పించాడు. సూర్య ప్రతాప్ కూడా సుకుమార్ వద్ద రైటింగ్, దర్శకత్వ శాఖలో పనిచేశాడు.

Allu Arha : అర్హ కోసం సెట్‌లో అందరూ తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది..

దర్శకుడు, ప్లే బ్యాక్ లాంటి సినిమాలతో విమర్శకులని మెప్పించాడు డైరెక్టర్ జక్కా హరిప్రసాద్. ఇతను కూడా సుకుమార్ దర్శకత్వ శాఖలో పని చేశాడు.

Sukumar Assistants entry in Tollywood and impress with their first movies

త్వరలో సాయి ధరమ్ తేజ్ హీరోగా విరూపాక్ష అనే ఓ ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నాడు. కార్తీక్ కూడా సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇలా సుకుమార్ దగ్గర పనిచేసిన వాళ్లంతా టాలీవుడ్ లోకి డైరెక్టర్స్ గా ఎంట్రీ ఇస్తూ మొదటి సినిమాతోనే మెప్పించి గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకుంటున్నారు. వీరంతా భవిష్యత్తులో మరిన్ని గొప్ప సినిమాలు ఇవ్వడం ఖాయం. ఇంకా సుకుమార్ దగ్గర నుంచి ఎంతమంది వస్తారో డైరెక్టర్స్ చూడాలి.