Pushpa : అసలు మజా పార్ట్ 2లో ఉంది : సుకుమార్

సుకుమార్ మాట్లాడుతూ... 'పుష్ప' అసలు కథ పార్ట్-2లోనే ఉంది. పార్ట్-1 అసలు కథకి ఒక లీడ్ మాత్రమే. పార్ట్ 2 మరో లెవల్లో ఉంటుంది. ఇప్పుడు ఉన్న అన్ని పాత్రలు పార్ట్ 2లో............

Pushpa : అసలు మజా పార్ట్ 2లో ఉంది : సుకుమార్

Pushpa Part2

Pushpa :   బన్నీ-సుక్కు కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప’ సినిమా మంచి టాక్ తెచ్చుకొని విజయం సాధించింది. కలెక్షన్స్ పరంగా కూడా బాగానే వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో గా ఈ సినిమాని నడిపించాడు. ముందు నుంచి ఈ సినిమా టీజర్, సాంగ్స్ బాగా వైరల్ అవడంతో జనాలకి సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్టు సినిమాని కూడా గ్రాండ్ గా తీశారు. అయితే ఇప్పుడు కేవలం పార్ట్ 1 మాత్రమే విడుదల చేశారు. పార్ట్ 2 తర్వాత రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ సినిమాపై కొన్ని చోట్ల మిక్స్‌డ్ టాక్ కూడా వినిపించింది. కొన్ని చోట్ల ల్యాగ్ ఉందని. క్లైమాక్స్ కూడా అసంపూర్ణంగా వదిలేశారని, ఫాహిద్ ఫాజిల్ ని సరిగ్గా వాడుకోలేదని, పుష్ప బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది కూడా చూపించలేదని, కొన్ని ప్రశ్నలు తలెత్తేలా చేసి వదిలేశారని విమర్శలు వచ్చాయి. అయితే పార్ట్ 1 సక్సెస్ సాధించిన సందర్భంగా ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ నిన్న మీడియాతో మాట్లాడారు. ఈ సక్సెస్ మీట్ లో సుకుమార్ ఈ విషయాలపై మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

NANI : సోషల్ మీడియాలో అన్న మాటలకి నా వైఫ్ 10 సూట్స్ కొని పెట్టింది : నాని

సుకుమార్ మాట్లాడుతూ… ‘పుష్ప’ అసలు కథ పార్ట్-2లోనే ఉంది. పార్ట్-1 అసలు కథకి ఒక లీడ్ మాత్రమే. పార్ట్ 2 మరో లెవల్లో ఉంటుంది. ఇప్పుడు ఉన్న అన్ని పాత్రలు పార్ట్ 2లో మరో రేంజులో ఉంటాయి. సెకండ్ పార్ట్ లో మరో మూడు పాత్రల్ని కూడా అదనంగా యాడ్ చేస్తున్నాం అని అన్నారు. పార్ట్ 2లో ఫహద్ ఫాజిల్ పూర్తి స్థాయి పెర్ఫార్మెన్స్ ఉంటదని, అనసూయకి కూడా సెకండ్ పార్ట్ లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సుకుమార్ అన్నారు. సుకుమార్ ఇలా హైప్ ఇచ్చేసరికి పార్ట్ 2 కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.