Anasuya : బిజెపి నేత నిర్మాణంలో సునీల్, అనసూయ మెయిన్ లీడ్స్‌గా సినిమా

అనసూయ, సునీల్ ముఖ్య పాత్రలుగా 'దర్జా' సినిమా రానుంది. సునీల్ కూడా ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతున్నాడు. ఇటీవలే 'పుష్ప'లో సునీల్, అనసూయ కలిసి భార్య భర్తలుగా నటించారు.....

Anasuya :  బిజెపి నేత నిర్మాణంలో సునీల్, అనసూయ మెయిన్ లీడ్స్‌గా సినిమా

Darjaa

Darja :  ఇటీవల అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒకపక్క జబర్దస్త్ లో యాంకర్ గా అలరిస్తూనే మరో పక్క సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తుంది. రీసెంట్ గా ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణిగా అందర్నీ మెప్పించింది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది అనసూయ.

అనసూయ, సునీల్ ముఖ్య పాత్రలుగా ‘దర్జా’ సినిమా రానుంది. సునీల్ కూడా ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అవుతున్నాడు. ఇటీవలే ‘పుష్ప’లో సునీల్, అనసూయ కలిసి భార్య భర్తలుగా నటించారు. తాజాగా వీరిద్దరూ మెయిన్ లీడ్స్ గా సినిమా రానుంది.

Sohel : ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.. మూడో సినిమా షూట్ మొదలుపెట్టిన సోహెల్..

బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో, పీఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలుగా ‘దర్జా’ సినిమా రూపొందుతుంది. సలీమ్‌ మాలిక్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో అనసూయ కత్తి పట్టుకొని చాలా సీరియస్ గా చూస్తున్నట్టు ఉంది. ఈ సినిమాని హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలో షూటింగ్‌ చేస్తున్నారు. ఈ సంవత్సరమే ‘దర్జా’ సినిమా విడుదల అవ్వనుంది.