Sunil: ముగ్గురు అమ్మాయిల కోసం దేవుడిగా మారిన సునీల్..!

కమెడియన్ గా ప్రస్థానం ఆరంభించి ప్రేక్షకులను అలరించిన సునీల్ ఆ తర్వాత హీరోగా కూడా మారి అలరించే ప్రయత్నం చేశాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న సినిమాతో హీరోగా ..

Sunil: ముగ్గురు అమ్మాయిల కోసం దేవుడిగా మారిన సునీల్..!

Sunil

Sunil: కమెడియన్ గా ప్రస్థానం ఆరంభించి ప్రేక్షకులను అలరించిన సునీల్ ఆ తర్వాత హీరోగా కూడా మారి అలరించే ప్రయత్నం చేశాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న సినిమాతో హీరోగా మారిన సునీల్ ఆ తర్వాత హీరోగా కొనసాగేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. కానీ అది అనుకున్న స్థాయిలో కుదరకపోవడంతో కెరీర్ లో మరో కొత్త మలుపు తీసుకుంది. ఆ మధ్య తన స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మళ్ళీ సునీల్ కమెడియన్ గానే కనిపించగా మధ్యలో విలన్ గా కూడా మారాడు.

Acharya: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్

సందీప్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన కలర్ ఫొటో చిత్రంలో సునీల్ విలన్ పాత్ర పోషించి మెప్పించాడు. ఒకవిధంగా సునీల్ ఇప్పుడు ఒక టైప్ పాత్రలే చేయాలని కూర్చోకుండా పాత్ర నచ్చితే.. నటుడిగా దేనికైనా సిద్దమవుతున్నాడు. అందుకే ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. సునీల్ ఇప్పుడు ఓ ముగ్గురు అమ్మాయిల కోసం ‘దేవుడిగా’ మారిపోతున్నాడట. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 నిర్మిస్తున్న ఓ సినిమాలో సునీల్ దేవుడి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

Prabhas: నడుస్తున్న ప్రభాస్ జమానా.. వందలకోట్ల రెమ్యూనరేషన్?

‘హెడ్స్ అండ్ టేల్స్’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాలో సునీల్ఓ కీలక పాత్రలో నటించాడట. శ్రీవిద్య మహర్షి, దివ్య శ్రీపాద, సునీల్, చాందిని రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌కు ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించగా.. ఈ సినిమాలో మనుషుల తలరాతలు రాసే భగవంతుడి పాత్రలో సునీల్ కనిపించనున్నాడట. ఇందుకు సంబంధించి ఓ స్వామిజీ గెటప్‌లో సునీల్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.