Prabhas: నడుస్తున్న ప్రభాస్ జమానా.. వందలకోట్ల రెమ్యూనరేషన్?

బాహుబలికే హయ్యస్ట్ పెయిడ్ టాలీవుడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమా హిట్ తో 100కోట్ల రెమ్యూనరేషన్ ని ఎప్పుడో క్రాస్ చేసేశారు. ఎప్పుడో 5 ఏళ్ళక్రితం వచ్చిన బాహుబలికే అంత..

Prabhas: నడుస్తున్న ప్రభాస్ జమానా.. వందలకోట్ల రెమ్యూనరేషన్?

Prabhas

Prabhas: బాహుబలికే హయ్యస్ట్ పెయిడ్ టాలీవుడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమా హిట్ తో 100కోట్ల రెమ్యూనరేషన్ ని ఎప్పుడో క్రాస్ చేసేశారు. ఎప్పుడో 5 ఏళ్ళక్రితం వచ్చిన బాహుబలికే అంత రెమ్యూనరేషన్ తీసుకుంటే వరుసగా 5 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కి ప్రస్తుతం ఎన్ని వందల కోట్ల రెమ్యూనరేషన్ దక్కుతుందో తెలుసా..?

Jacqueline Fernandez: శ్రీలంక బ్యూటీ అందాల జాతర.. ‘సాహో’ అనాల్సిందే!

ప్రజెంట్ అంతా ప్రభాస్ టైమ్ నడుస్తోంది. వరస పెట్టి సినిమాలు అనౌన్స్ చెయ్యడమే కాదు.. నాన్ స్టాప్ గా షూటింగ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు ప్రభాస్. తెలుగు సినిమాని వరల్డ్ కాన్వాస్ మీద చూపించి టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి చూపించి 2 వేల కోట్ల కలెక్షన్లతో తెలుగు సినిమా స్టామినాని ప్రూవ్ చేశారు. ప్రభాస్ తన సినిమాల కలెక్షన్లతో పాటు రెమ్యూనరేషన్ కూడా ప్యాన్ ఇండియా లెవల్లోనే తీసుకుంటున్నారు.

Most Eligible Bachelor: హిట్ కొడతానని అఖిల్ శపథం.. అంత కాన్ఫిడెంట్ ఏంటో!

బాహుబలి ముందు వరకూ 15 కోట్లు తీసుకున్న ప్రభాస్.. బాహుబలికి ప్రాఫిట్ షేర్ తో కలిపి దాదాపు 200కోట్లు తీసుకున్నారు. ఆతర్వాత సాహోకి 70 కోట్లు తీసుకున్నట్టు టాక్. సాహో తర్వాత 5 సినిమాల్ని లైన్లో పెట్టిన ప్రభాస్.. ఈ5 సినిమాలకు కలిపి దాదాపు 600కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Big Boss 5: హమీదా కావాలా?.. టైటిల్ కావాలా?.. శ్రీరామ్‌కు నాగ్ సూటి ప్రశ్న!

రాధేశ్యామ్ ని రిలీజ్ కు రెడీ చేసిన ప్రభాస్.. ఈ సినిమాకు 100కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కుతున్న సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలకు కూడా 100కోట్లకు పైనే తీసుకుంటున్నారు. ఇక రీసెంట్ గా అనౌన్స్ చేసిన ప్రభాస్ 25వ సినిమా స్పిరిట్ కి అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నట్టు టాక్. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాలు అవ్వడం, రీచబిలిటీ కూడా ఎక్స్ పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే ఉండడంతో మేకర్స్ కూడా ప్రభాస్ కి ఎంతైనా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.