Sunny Leone : 2000 రూపాయల లోన్ కోసం సన్నీ లియోన్ పాన్ కార్డు వాడకం.. ట్విట్టర్లో సన్నీ కంప్లైంట్

బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్ పాన్ కార్డుని కేవలం 2000 రూపాయల లోన్ కోసం వాడాడు ఓ ప్రబుద్దుడు. సన్నీ లియోన్ ఈ మేరకు సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తూ పోస్ట్ చేసింది...............

Sunny Leone : 2000 రూపాయల లోన్ కోసం సన్నీ లియోన్ పాన్ కార్డు వాడకం.. ట్విట్టర్లో సన్నీ కంప్లైంట్

Sunny

Sunny Leone :  ఇటీవల ఆన్లైన్ మోసాలు బాగా పెరిగాయి. ఇక సెలబ్రిటీల పేర్లు చెప్పుకొని కాల్స్, మెసేజ్ లు చేసి డబ్బుల కోసం మోసాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కొంతమంది ఏకంగా సెలబ్రిటీలనే మోసం చేయడానికి చూస్తున్నారు. ఈ మోసం అయితే చాలా విచిత్రంగా ఉంది. బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్ పాన్ కార్డుని కేవలం 2000 రూపాయల లోన్ కోసం వాడాడు ఓ ప్రబుద్దుడు.

సన్నీ లియోన్ ఈ మేరకు సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తూ పోస్ట్ చేసింది. సన్నీ లియోన్‌ ట్వీట్‌ చేస్తూ.. ”ఎవరో ఇడియట్ నా పాన్ కార్డుతో 2 వేల రూపాయల రుణం తీసుకుని నా సిబిల్ స్కోరును దెబ్బతీశాడు. ఈ విషయంలో ఐవీఎల్ సెక్యూరిటీస్ నాకు సాయం చేయలేదు. ఇండియాబుల్స్ దీన్ని ఎలా అనుమతిస్తుంది’’ అంటూ దీనికి సంబంధించిన సంస్థలని ట్యాగ్ చేసి కంప్లైంట్ చేసింది.

Eesha Rebba : లిప్‌లాక్, రొమాన్స్‌లతో రెచ్చిపోయిన ఈషారెబ్బ

అయితే ఈ సమస్యని పరిష్కరించగా ట్వీట్ ని డిలీట్ చేసి మరో ట్వీట్ పెట్టింది సన్నీ. ఈ సారి.. ”ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్, సిబిల్‌కు ధన్యవాదాలు. వేగంగా నా సమస్యను పరిష్కరించారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కావని ఆశిస్తున్నాను. ఎందుకంటే చెత్త సీబీల్ స్కోర్‌ను ఎవరూ కోరుకోరు’ అంటూ ట్వీట్ చేసింది. అయితే కేవలం 2000 రూపాయల కోసం ఏకంగా సన్నీ లియోన్ పాన్ కార్డుని వాడడం విచిత్రం. మరి అతను ఎవరు అనేది మాత్రం తెలియలేదు.