Chatur Mukham : ‘ఆహా’ లో మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె నటించిన టెక్నో హారర్ థ్రిల్లర్.. ‘చతుర్ ముఖం’..

టెక్నో హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘చతుర్ ముఖం’ ఆగ‌స్ట్ 13న ‘ఆహా’ లో విడుద‌ల‌ కానుంది..

Chatur Mukham : ‘ఆహా’ లో మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె నటించిన టెక్నో హారర్ థ్రిల్లర్.. ‘చతుర్ ముఖం’..

Chatur Mukham: హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’ లో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, వైవిధ్య‌మైన వెబ్ ఒరిజిన‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టెక్నో హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘చతుర్ ముఖం’ ఆగ‌స్ట్ 13న విడుద‌ల‌వుతుంది. మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె, శ్రీకాంత్ ముర‌ళి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రాన్ని రంజీత్ కామ‌ల శంక‌ర్‌ డైరెక్ట్ చేశారు.

Super Deluxe : ‘ఆహా’లో ఆగ‌స్ట్ 6న విమ‌ర్శ‌కుల ప్ర‌శ‌సంలు పొందిన ‘సూప‌ర్ డీల‌క్స్‌’ ప్రీమియ‌ర్‌..

ఈ చిత్రానికి మ‌ల‌యాళ ‘చతుర్ ముఖం’ మాతృక‌.. బుసాన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్(బీఐఎఫ్ఏఎన్‌), చుంచియాన్ ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌(సీఐఎఫ్ఎఫ్‌), మేలిస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫెస్టివ‌ల్‌(ఎంఐఎఫ్ఎఫ్‌) ఇలా ప‌లు అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ప్ర‌ద‌ర్శిత‌మైంది. రీసెంట్‌గా ఈ సినిమా తెలుగు పోస్ట‌ర్‌ను ‘ఆహా’ టీం రిలీజ్ చేశారు.
‘చతుర్ ముఖం’.. ప్ర‌స్తుత కాలానికి చెందిన తేజ‌స్విని అనే మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన మ‌హిళ జీవితం చుట్టూ తిరిగే క‌థ‌.

Tharagathi Gadhi Daati : ‘ఆహా’ లో మ‌రో క్రేజీ ఒరిజిన‌ల్‌.. ‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’..

ఈమె స్నేహితుడు ఆంటోనితో క‌లిసి సీసీటీవీ సోల్యుష‌న్స్ వ్యాపారాన్ని చేస్తుంటుంది. ఆమె త‌న మొబైల్ ఫోన్‌కు విప‌రీతంగా అల‌వాటు ప‌డుంటుంది. ఓ ప్ర‌మాదంలో ఆ ఫోన్ ప‌ని చేయ‌కుండా పోతుంది. అప్పుడు త‌క్కువ ధ‌ర‌లో ఎక్కువ ఫీచ‌ర్స్ ఉన్న బ్రాండెడ్ కాని ఓ మొబైల్ ఫోన్‌ను తేజ‌స్విని కోనుగోలు చేస్తుంది. ఫోన్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఆమె చుట్టూ ఆతీంద్రీయ శ‌క్తుల ప్ర‌భావంతో కొన్ని పనులు జ‌రుగుతుంటాయి. అవి ఆమె ఉనికికే ప్ర‌మాదంగా మారుతాయి. ఇలాంటి ప్ర‌మాదం నుంచి ఆమె ఎలా బ‌య‌ప‌డింది. ఎలాంటి ప‌రిష్కారం క‌నుగొంద‌నేదే క‌థ‌. భార‌తీయ సినిమాల్లో అరుదైన జోన‌ర్‌లో వ‌స్తున్న ‘చతుర్ ముఖం’, సినిమా చూసే ప్రేక్ష‌కులు ప్ర‌తి నిమిషం థ్రిల్ అవుతుంటారు.

Kudi Yedamaithe Review : థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేతో అదరగొట్టిన ‘కుడి ఎడమైతే’..
ప్ర‌తి వారం.. ‘ఆహా’ త‌మ వీక్ష‌కుల కోసం తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాల‌ను అందించింది. మ‌మ్ముట్టి నటించిన ‘వ‌న్‌’, న‌య‌న‌తార ‘నీడ‌’, రిష‌బ్ శెట్టి ‘హీరో’, టోవినో థామ‌స్ యాక్ష‌న్ మూవీ ‘కాలా’, విజ‌య్ సేతుప‌తి ‘విక్ర‌మార్కుడు’ చిత్రాలు స‌హా ప‌లు ఒరిజిన‌ల్స్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు ‘ఆహా’ అందించింది. రీసెంట్‌గా అమ‌లా పాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా విడుద‌లైన సై ఫై థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘కుడి ఎడ‌మైతే’ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. లక్ష్మీ మంచు హోస్ట్‌గా సెల‌బ్రిటీలు చేస్తున్న వంట‌ల షో ‘ఆహా భోజ‌నంబు’ ల‌తో పాటు ఈ ఏడాది ‘క్రాక్‌’, ‘నాంది’, ‘లెవ‌న్త్ అవ‌ర్‌’, ‘జాంబి రెడ్డి’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వంటి సినిమాలు, ఒరిజ‌న‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది ‘ఆహా’.