Kudi Yedamaithe Review : థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లేతో అదరగొట్టిన ‘కుడి ఎడమైతే’..

బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ షోలతో పాత్ బ్రేకింగ్ క్రియేట్ చేస్తున్న తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ లో ‘కుడి ఎడమైతే’ అనే ప్రెస్టీజియస్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది..

10TV Telugu News

Kudi Yedamaithe Review: ప్రతి వారం ఎగ్జైటింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులకు ఆశ్చర్యపరుస్తూ, అంతులేని ఆనందాన్నిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ షోలతో పాత్ బ్రేకింగ్ క్రియేట్ చేస్తున్న ఈ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ లో ‘కుడి ఎడమైతే’ అనే ప్రెస్టీజియస్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇండియాలో డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రసారమవుతున్న తొలి సైంటిఫికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇది. అమలా పాల్, రాహుల్ విజయ్ మెయిన్ లీడ్స్‌గా నటించారు. రామ్ విఘ్నేశ్ రూపొందించిన ఈ సిరీస్‌ను ‘లూసియా’, ‘యూ టర్న్’ వంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు పవన్ కుమార్ డైరెక్ట్ చేశారు. ప్రోమోస్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ‘కుడి ఎడమైతే’ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉందో చూద్దాం..

Kudi Yedamaithe

కథ విషయానికొస్తే..
యాక్టర్ కావాలనుకుని కలలు కనే ఆది (రాహుల్ విజయ్) పరిస్థితుల కారణంగా డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ.. అవకాశాలకోసం ప్రయత్నిస్తుంటాడు. దుర్గా (అమలా పాల్) ఖైరతాబాద్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తుంటుంది. సిటీలో వరుసగా జరుగుతున్న పిల్లల కిడ్నాప్‌కి సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. పార్వతి (నిత్యశ్రీ) తనతో కొద్దిరోజులు బ్లైండ్ డేటింగ్ చేసిన హర్ష అనే కుర్రాడి ఆచూకీ కోసం వెతుకుంటుంది. అయితే ఆది, దుర్గ, పార్వతి.. వీళ్ల ముగ్గురి జీవితాల్లోనూ ఒకే రోజు (ఫిబ్రవరి 29) అనుకోని సంఘటనలు జరుగుతాయి.

అవేంటి.. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో ఆదిని పోలీస్ జీపుతో యాక్సిడెంట్ చేసింది దుర్గా గౌడ్ ఏనా.. పార్వతి వెతుకుతున్న హర్ష ఆచూకీ తెలిసిందా?.. అసలు తనకు యాక్సిడెంట్ అవడానికి ముందు ఆది చూసిన షాకింగ్ సంఘటన ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే మాత్రం ‘కుడి ఎడమైతే’ ఫస్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే..

నటీనటులు..
ఆదిగా రాహుల్ విజయ్, దుర్గగా అమలా పాల్ నటన నెక్ట్స్ లెవల్లో ఉంది. ఈ సిరీస్‌కి వీరిద్దరు బెస్ట్ ఛాయిస్ అనేలా పర్ఫార్మ్ చేశారు. రవి ప్రకాషే కిడ్నాపర్‌ అనే హింట్ ఇచ్చారు. మిగతా క్యారెక్టర్లు అలా వచ్చి ఇలా వెళ్లేవే. ఇక ఎపిసోడ్ ఫినిషింగ్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి.

Aha : ‘ఆహా’ లో.. అదిరిపోయే సినిమాలు..

ఎలా ఉందంటే..
కంటెంట్‌కి తెరమీద కనబడే క్యారెక్టర్లకి ఆడియెన్ కనెక్ట్ అయితే.. అది థియేటరా.. ఓటీటీనా.. అనే తేడా చూడకుండా నెత్తిన పెట్టుకుంటారు ప్రేక్షకులు.. ‘కుడి ఎడమైతే’ కచ్చితంగా ఆ కోవలోకే చేరుతుంది. ‘లూసియా’, ‘యూటర్న్’ సినిమాలను ఎంత గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, సస్పెన్స్‌ కలిగించేలా, ఆద్యంతం ఆకట్టుకునేలా ఉత్కంఠభరితంగా రూపొందించిన దర్శకుడు పవన్ కుమార్ మరోసారి తన మార్క్ చూపించారు. ,విజువల్స్, ఆర్ఆర్ హైలెట్ అయ్యాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఫస్ట్ ఎపిసోడ్‌తోనే బెస్ట్ సిరీస్ అనిపించి అంచనాలు మరింత పెంచేశారు డైరెక్టర్.