Suriya : ‘ఆచార్య’ రోజునే సూర్య కొత్త సినిమా..

సూర్య 40వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు..

Suriya : ‘ఆచార్య’ రోజునే సూర్య కొత్త సినిమా..

Suriya

Suriya: తమిళ్‌తో పాటు తెలుగులోనూ ప్రేక్షకాదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు స్టార్ హీరో సూర్య. ఆయన నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలతో సాలిడ్ హిట్స్ అందుకుని ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా.. సొసైటీలోనూ ఆలోచనను రేకెత్తించారు.

Pushpa Movie : నన్ను కొట్టేటోడు భూమ్మీద పుట్టలేదంటున్న ‘పుష్ప’ రాజ్..

సూర్య ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో ‘ఎదర్కుం తునిందవన్’ సినిమా చేస్తున్నారు. సూర్య నటిస్తున్న 40వ సినిమా ఇది. కళానిధి మారణ్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రియాంక మోహన్ కథానాయిక.

Balayya – Mahesh : బాలయ్య – మహేష్ మల్టీస్టారర్..

ఇటీవలే షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. శుక్రవారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2022 ఫిబ్రవరి 4న ‘ఎదర్కుం తునిందవన్’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. సూర్య సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి.

Jai Bheem : ‘జై భీమ్’ సినిమాపై సీతక్క ట్వీట్.. రిప్లై ఇచ్చిన సూర్య

ఫిబ్రవరి 4న కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన క్రేజీ మూవీ ‘ఆచార్య’ రిలీజ్ కానుంది. మరి ఆరోజే సూర్య సినిమా తెలుగులో వస్తుందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ముందుగా తమిళ్‌లో విడుదల చేసి, తర్వాత కొద్దిరోజులకు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారని సమాచారం.