Kanguva: కంగువా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువా’ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Kanguva: కంగువా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

Suriya Kanguva Movie First Single Song To Be Out Soon

Kanguva: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రానికి ‘కంగువా’ అనే టైటిల్‌ను ఇటీవల ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను ఫిక్షనల్ కథగా చిత్ర యూనిట్ రూపొందిస్తుండంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Kanguva : కేరళలో సూర్య కంగువ షూటింగ్.. షూటింగ్ ఎంత పూర్తి అయ్యిందో తెలుసా?

కాగా, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికిపైగా పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా టైటిల్‌ను ఇటీవల అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ రావడంతో, ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాగా, ఇప్పుడు ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను మే రెండో వారంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Kanguva : కోలీవుడ్ సత్తా ‘కంగువ’తో చూపించేందుకు సిద్దమైన సూర్య..

ఈ సినిమాలో యోధుడి పాత్రలో సుర్య పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ సినిమాలో అందాల భామ దిషా పటాని హీరోయిన్‌గా నటిస్తోండగా, మరో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.