Suriya : తెలుగు అభిమానులపై సూర్య స్పెషల్ పోస్ట్.. మీరు ఎప్పుడూ బెస్ట్..
తాజాగా హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్(Surya S/O Krishnan) సినిమా తెలుగులో రీ రిలీజ్ అయింది.
![Suriya : తెలుగు అభిమానులపై సూర్య స్పెషల్ పోస్ట్.. మీరు ఎప్పుడూ బెస్ట్.. Suriya : తెలుగు అభిమానులపై సూర్య స్పెషల్ పోస్ట్.. మీరు ఎప్పుడూ బెస్ట్..](https://10tv.in/wp-content/uploads/2023/08/suriya-son-of-krishnan.jpg)
Suriya Special post on Telugu Audience regarding Surya S/o Krishnan Movie Re Release
Suriya : తమిళ్ స్టార్ హీరో సూర్యకి తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. సూర్య తమిళ సినిమాలన్నీ ఇక్కడ డబ్బింగ్ అయి రిలీజ్ అవుతాయి. సూర్య సినిమాలు తెలుగులో కూడా భారీ విజయం సాధించాయి. ఇటీవల ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలని రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు థియటర్స్ లో సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మన స్టార్ హీరోల సినిమాలే కాదు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయి.
తాజాగా హీరో సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్(Surya S/O Krishnan) సినిమా తెలుగులో రీ రిలీజ్ అయింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ 2008లో తెరకెక్కించిన ఈ సినిమాలో సూర్య, సిమ్రాన్, సమీరా రెడ్డి నటించారు. సూర్య డబల్ రోల్ ప్లే చేశారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పటికి ఈ సినిమా సాంగ్స్ చాలా మందికి ఫేవరేట్. తాజాగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాని తెలుగులో రీ రిలీజ్ చేయగా అభిమానులు, ప్రేక్షకులు థియేటర్స్ కి పోటెత్తారు.
Balagam Movie : అసెంబ్లీలో బలగం సినిమా గురించి మాట్లాడిన కేటీఆర్.. ఏమన్నారో తెలుసా?
థియేటర్స్ లో సాంగ్స్ కి అల్లరి చేసి, గోల చేసి సందడి చేశారు. మన తెలుగు స్టార్ హీరోల రీరిలీజ్ లకు సమానంగా సూర్య సన్నాఫ్ కృష్ణన్ కి రెస్పాండ్ వచ్చింది. థియేటర్స్ లో తెలుగు ఫ్యాన్స్ చేసిన సందడి చూసి సూర్య ఆశ్చర్యపోయి దీనిపై స్పెషల్ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియోని షేర్ చేసి.. ఈ ప్రేమ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. సూర్య సన్నాఫ్ కృష్ణన్ టీం నుంచి స్పెషల్ థ్యాంక్స్. సినిమాని ఎంజాయ్ చేయడంలో మీరు బెస్ట్ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
This love is a huge surprise!!!
A big thank you from team #SuriyaSonOfKrishnan
Awestruck – you guys are the best!! ❤️ pic.twitter.com/N2zrxpmKrp— Suriya Sivakumar (@Suriya_offl) August 5, 2023