Balagam Movie : అసెంబ్లీలో బలగం సినిమా గురించి మాట్లాడిన కేటీఆర్.. ఏమన్నారో తెలుసా?

మంత్రి కేటీఆర్ పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో బలగం సినిమా గురించి మాట్లాడారు.

Balagam Movie : అసెంబ్లీలో బలగం సినిమా గురించి మాట్లాడిన కేటీఆర్.. ఏమన్నారో తెలుసా?

Minister KTR Speaks about Balagam Movie in Assembly

Balagam Movie : తెలంగాణ(Telangana) వర్షాకాల అసెంబ్లీ(Assembly) సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నాయకులపై, ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ వాటికి గట్టిగా సమాధానాలు కూడా ఇస్తుంది. ఇక అధికార మంత్రులు తాము చేసిన అభివృద్ధి, పనుల గురించి చెప్తున్నారు అసెంబ్లీలో. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో బలగం సినిమా గురించి మాట్లాడారు.

కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) జంటగా దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) నిర్మాణంలో తెరకెక్కిన సినిమా బలగం. చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయం సాధించింది. మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన సినిమా బలగం(Balagam) కలెక్షన్స్ తో పాటు పేరు, అవార్డులు కూడా సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై ప్రేక్షకులు, ప్రముఖుల నుంచి అభినందనలు భారీగా వచ్చాయి.

తాజాగా అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు కరువు, కటిక నేలల్లో షూట్స్ చేయాలంటే సినిమా వాళ్ళు రాయలసీమ, తెలంగాణని చూపించేవాళ్ళు. కానీ ఇప్పుడు పల్లె అందాలు, పచ్చని ప్రకృతి చూడాలంటే తెలంగాణ పల్లెటూళ్ళని వెతుక్కుంటూ వస్తున్నారు సినిమా వాళ్లు. మా సిరిసిల్ల బిడ్డ వేణు ఎల్దండి బలగం అనే సినిమా తీశాడు. సినిమా ప్రమోషన్స్ కి నన్ను పిలిచాడు. సిరిసిల్లలో ఫంక్షన్ పెట్టు అని చెప్పనా. దిల్ రాజు వాళ్ళ అమ్మాయి ఈ సినిమా తీశారు. సినిమా చాలా బాగుంది. ఆ సినిమాలో అనుబంధాలు, మానవ సంబంధాలు బాగా చూపించారు. ఊళ్లన్నీ ఆ సినిమాని పండగలా చూశాయి. ఆ సినిమాలో మానవ బంధాలతో పాటు పల్లె అందాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ సినిమా షూటింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలో జరిగింది. ఈ సినిమాని మా కుటుంబ సభ్యులతో కలిసి చూశాను. సినిమా చూసి అందరూ నన్ను ఒక్కటే అడిగారు. ఈ సినిమాలో చూపించిన గ్రామం నిజంగా మీ సిరిసిల్లదేనా, తెలంగాణ గ్రామమేనా, అది కోనరావుపేటనా కోనసీమనా అని అడిగారు. తెలంగాణ కరువు సీమలు అన్ని ఇప్పుడు కోనసీమలా అయ్యాయి అని తెలిపారు.

Baby Movie : సూపర్ హిట్ ‘బేబీ’ మళ్ళీ రిలీజ్.. మరిన్ని సీన్స్, ఒక సాంగ్ యాడ్ చేసి.. 25 డేస్ సెలబ్రేషన్స్..

దీంతో మంత్రి కేటీఆర్ బలగం గురించి అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బలగం చిత్రయూనిట్ కేటీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.