Swiggy Boy: ప్రేమికుల మధ్య గొడవ: పరిష్కరించడానికి వెళ్లి యువతిని కొట్టిన స్విగ్గీ డెలివరీ బాయ్

ప్రేమికుల గొడవను సర్ది చెప్పేందుకు వెళ్లిన ఒక స్విగ్గీ డెలివరీ బాయ్..చివరకు తానే ఆ గొడవలో చిక్కుకుని..యువతిపై దాడి చేసిన ఘటన ఇది.

Swiggy Boy: ప్రేమికుల మధ్య గొడవ: పరిష్కరించడానికి వెళ్లి యువతిని కొట్టిన స్విగ్గీ డెలివరీ బాయ్

Swiggy

Swiggy Boy: ప్రేమికుల గొడవను సర్ది చెప్పేందుకు వెళ్లిన ఒక స్విగ్గీ డెలివరీ బాయ్..చివరకు తానే ఆ గొడవలో చిక్కుకుని..యువతిపై దాడి చేసిన ఘటన ఇది. యువతి, డెలివరీ బాయ్ కొట్టుకున్న ఘటన తాలూకు దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే ఒడిశాలోని భుబనేశ్వర్ నగరంలో ఇటీవల ఒక ప్రేమజంట నడిరోడ్డు పై గొడవ పెట్టుకున్నారు. బిజీ రోడ్డులో వాహనాల రద్దీ సమయంలో ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. ఈక్రమంలో యువకుడిపై రాళ్లు విసురుతూ యువతి స్థానికంగా బీభత్సం సృష్టించింది. ఈతతంగాన్ని చూసేందుకు జనం గుంపుగా అక్కడికి చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ జాం అవగా..అప్పుడే అటుగా వచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్..ఆ యువతీయువకుల వద్దకు వెళ్లి..సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే సదరు యువతి..మరింత రెచ్చిపోయి..డెలివరీ బాయ్ ని సైతం నోటికొచ్చినట్లు దుర్భాషలాడింది.

Also Read:Aryan Khan: ఆర్యన్ డ్రగ్స్ కేసులో మలుపు.. కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్ మృతి ..

డెలివరీ బాయ్ సైతం ఆ యువతిని దుర్భాషలాడాడు. అప్పటికే ప్రియుడి తీరుతో విసుగు చెందిన ఆ యువతి..డెలివరీ బాయ్ కూడా తిట్టటడంతో ఆగ్రహం పట్టలేక..స్విగ్గీ డెలివరీ బాయ్ పై దాడి చేసింది. దీంతో డెలివరీ బాయ్ సైతం తిరిగి యువతి చెంప చెళ్లుమనిపించాడు. అయినా ఆ యువతి మరింత రెచ్చిపోవడంతో..డెలివరీ బాయ్ పట్టలేని కోపంతో యువతిపై తీవ్ర దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తూండగానే నడిరోడ్డుపై స్విగ్గీ డెలివరీ బాయ్ యువతిపై దాడి చేశాడు. అనంతరం స్థానికులు స్పందించి ఇరువురిని శాంతింపజేయడంతో గొడవ అప్పటికి సద్దుమణిగింది.

Also read:Gold Smuggling : పద్మావతి ట్రావెల్స్‌లో మూడేళ్లుగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్!

ఈఘటన తాలూకు దృశ్యాలను అక్కడున్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి. అయితే ఈఘటనలో యువతి గాని..స్విగ్గి డెలివరీ బాయ్ గానీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ఆధారంగా స్థానిక పోలీసులు ఇరువురిపై న్యూసేన్స్ కేసు నమోదు చేశారు. ప్రియుడు గత కొన్ని రోజులుగా మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నట్టు అనుమానించిన ఆ యువతి..ఈమేరకు ప్రియుడిని నిలదీయడంతో అసలు గొడవ మొదలైనట్లు స్థానికులు చెప్పుకొచ్చారు.