Corona 4th Wave : కరోనా కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ వేగంగా వ్యాపిస్తుంది- WHO

కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఈ   ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది.

Corona 4th Wave : కరోనా కొత్త వేరియంట్ ఎక్స్‌ఈ వేగంగా వ్యాపిస్తుంది- WHO

Omicaron Xe Variant

Corona 4th Wave :  కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఈ   ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది. కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలిస్తే ఒమిక్రాన్   ఎక్స్ఈ  సబ్ వేరియంట్10 శాతం వృధ్ధిరేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో వివరించింది.

ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి యూకేలో జనవరి 19వతేదీన కనుగొన్నామని, 600  కంటే ఎక్కువ ఎక్స్ఈ కేసులు నిర్దారణ అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఇప్పుడు యూఎస్ లో ఎక్కువ సంఖ్యలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని ఎక్స్ఈ వంటి రీకాంబినెంట్ వేరియంట్‌లకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ రిస్క్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ చెప్పారు.
Also Read : Cash-Gold Smuggling : శ్రీ పద్మావతి ట్రావెల్స్ లో నగదు, గోల్డ్ అక్రమ రవాణా.. బంగారం వ్యాపారుల్లో టెన్షన్
ఎక్స్ఈ తీవ్రత, వేగం వంటి లక్షణాలను గుర్తించబడే వరకు ఇది ఓమిక్రాన్ వేరియంట్ లో భాగంగానే వర్గీకరిస్తామమని WHO తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వీ1.1.529, బీఏ 1, బీఏ2 మరియు బీఏ3తో సహా నాలుగు వేరియంట్లను కలిగి  ఉంటుందని తెలిపింది. ఇందులో బీఏ2 అని పిలవహడే స్టీల్త్ వెర్షన్ కూడా ఉంది. ఇది ఒమిక్రాన్ యొక్క ప్రారంభ కేసు తర్వాత కొంతమందికి మళ్లీ సోకినట్లు నమోదు చేయబడింది.