Cash-Gold Smuggling : శ్రీ పద్మావతి ట్రావెల్స్ లో నగదు, గోల్డ్ అక్రమ రవాణా.. బంగారం వ్యాపారుల్లో టెన్షన్

జిల్లా వ్యాప్తంగా 20 మందికి పైగా బులియన్ హోల్ సేల్ వ్యాపారులు ఉన్నారు. అంతా పోన్లలోనే వ్యాపారం సాగుతోంది. ప్రత్యేక టీంలు నేరుగా రిటైల్ షాప్ లకు బంగారం, నగలు డెలివరీ చేస్తోన్నారు.

Cash-Gold Smuggling : శ్రీ పద్మావతి ట్రావెల్స్ లో నగదు, గోల్డ్ అక్రమ రవాణా.. బంగారం వ్యాపారుల్లో టెన్షన్

Cash Gold Smuggling

Cash and gold smuggling : శ్రీకాకుళం జిల్లాలో శ్రీ పద్మావతి ట్రావెల్స్ లో నగదు, బంగారు అక్రమ రవాణా గుట్టు కట్టు కావడంతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్ నెలకొంది. నరసన్నపేట కేంద్రంగానే బంగారం వ్యాపారం సాగింది. ఒక్క నరసన్నపేటలోనే పది మందికి పైగా హోల్ సేల్ బంగారం వ్యాపారం చేస్తోన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 మందికి పైగా బులియన్ హోల్ సేల్ వ్యాపారులు ఉన్నారు. అంతా పోన్లలోనే వ్యాపారం సాగుతోంది. ప్రత్యేక టీంలు నేరుగా రిటైల్ షాప్ లకు బంగారం, నగలు డెలివరీ చేస్తోన్నారు. ప్రతీ ఏడాది ఉగాది ఒక్క రోజునే 60 కిలోలకు పైగా బంగారం వ్యాపారం జరుగుతుందని సమాచారం.

హోల్ సేల్ వ్యాపారులు విజయవాడ, గుంటూరు, చెన్నై, నుండి బంగారం దిగుమతి చేసుకుంటూ రిటైల్ వర్తకులకు ఇస్తున్నారు. శ్రీకాకుళం, పలాస, నరసన్నపేట, టెక్కలి, రాజాం, ఇచ్చాపురం, సోంపేట, ఆముదాలవలసలలో 600కి పైగా నగల దుకాణాలు ఉన్నాయి. ట్రావెల్స్ లో దోరికిన డబ్పులు, బంగారానికి .. బిల్లులు, పత్రాలు సృష్టించి విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు జిల్లాలో టాక్ నడుస్తోంది.

West Godavari : పశ్చిమ గోదావరిలో పట్టుబడ్డ నగదు బంగారం వ్యాపారులదా ?

ఉభయగోదావరి జిల్లాల పోలీసుల తనిఖీల్లో ఈ దందా బయటపడింది. ఉదయం పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఉదయాన్నే పద్మావతి ట్రావెల్స్ బస్సును ఆపి తనిఖీలు చేశారు. పలాస నుంచి గుంటూరు వెల్తున్న ఈ బస్సులో 4 కోట్ల 78 లక్షల రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. అటు తూర్పు గోదావరి జిల్లాలోనూ బస్సుల్లో సాగుతున్న ఈ దందాకు పోలీసులు చెక్ చెప్పారు.

కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా దగ్గర పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల్లో నగదు.. బంగారం మార్చుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. ఓ బస్సులో నుంచి 5 కోట్ల 6 లక్షల నగదును.. మరో బస్సులో నుంచి 10 కేజీల బంగారాన్ని పట్టుకున్నారు.