Mithali Raj biopic: మిథాలీ బయోపిక్‌లో తాప్సీ.. లిరిక్స్ లీక్

ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ మరి కొద్ది రోజుల్లో వెండితెరపై మెరవనుంది. ఇప్పటికే మూవీ టీం మిథాలీ రోల్స్ ను తాప్సీ నటిస్తున్నారని చెప్పేసింది.

Mithali Raj biopic: మిథాలీ బయోపిక్‌లో తాప్సీ.. లిరిక్స్ లీక్

Mithali Raj

Mithali Raj biopic: ఇండియన్ ఉమెన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ మరి కొద్ది రోజుల్లో వెండితెరపై మెరవనుంది. ఇప్పటికే మూవీ టీం మిథాలీ రోల్స్ ను తాప్సీ నటిస్తున్నారని చెప్పేసింది. ఈ ప్రాజెక్టు తనకెంతో నచ్చిచేస్తున్నానని తాప్సీ కూడా పలుమార్లు చెప్పారు. ఇటీవల సినిమాకు సంబంధించిన ర్యాప్ అప్ ను కూడా రిలీజ్ చేశారు.

ఆ లైన్లలో మిథాలీ రాజ్ జీవితంలో పడిన కష్టాలు.. ఒక మహిళగా క్రికెట్ లో రాణించడం గురించి స్పష్టమవుతోంది. ఆ ర్యాపప్ ను పోస్టు చేసి సినిమాకు సంబంధించినవే అంటూ బయోపిక్ గురించి కొంచెం హింట్ ఇచ్చారు. ఆ తర్వాత 2022 వరల్డ్ కప్ కు రెడీ అవ్వమంటూ మహిళా క్రికెట్ ను శుభాకాంక్షలు తెలిపారు.

‘8ఏళ్ల వయస్సులో ఒక కల వచ్చింది. క్రికెట్ అంటే కేవలం జెంటిల్మెన్స్ మాత్రమే ఆడేది కాదు. మాది కూడా అవుతుంది. ఉమెన్ ఇన్ బ్లూ అనే గుర్తింపు వస్తుంది. మేం వస్తున్నాం. దాని కోసమే త్వరపడుతున్నాం’ అని కామెంట్ పెడుతూ #ShabaashMithu హ్యాష్ ట్యాగ్ ఉంచారు.

…………………………………………. : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన కలెక్టర్ భార్య

మిథాలీ ప్రస్తుతం టీమిండియా మహిళల వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్సీ వహిస్తున్నారు. మహిళల అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచారు. ఈ సినిమా గురించి తాప్సీతో పాటు మిథాలీ కూడా ఎదురుచూస్తున్నానని అన్నారు.