Bhadradri Kothagudem Collector : ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన కలెక్టర్ భార్య
జిల్లా కలెక్టర్ తన భార్య కాన్పును ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించారు. దీంతో ఆ కలెక్టర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Collector
Bhadradri Kothagudem Collector Wife: నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనుకొనే వారు. కానీ..ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి. సర్కార్ దవఖానాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ వైద్యానికి జనాదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో… ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెంచాలని కొంతమంది కష్టపడుతుంటారు. ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా..జిల్లా కలెక్టర్ తన భార్య కాన్పును ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించారు. దీంతో ఆ కలెక్టర్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
అనుదీప్ దురిశెట్టి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 2017 లో జరిగిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో దేశంలోనే మొదటి ర్యాంక్ సాధించారు. ఇటీవలే ఆయన సతీమణి గర్భం దాల్చారు. భద్రాచలంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఆమెను చేరిపించారు. ఆసుపత్రిలో ఆమె పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు కలెక్టర్ అనుదీప్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.