Taapsee Vs Kangana : మరోసారి కంగనా వర్సెస్ తాప్సి.. నాకు కంగనాతో ప్రాబ్లమ్ లేదు.. ఆమెకే నాతో ప్రాబ్లమ్..

తాప్సి మాట్లాడుతూ.. నాకు కంగనాతో ఏం ప్రాబ్లమ్ లేదు. గతంలో నేను బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేసరికి ఆమె ఇక్కడ హీరోయిన్. మొదట్లో కనపడితే హాయ్, హలో అని మామూలుగానే మాట్లాడాను. ఆమెకే నాతో ప్రాబ్లమ్.................

Taapsee Vs Kangana : మరోసారి కంగనా వర్సెస్ తాప్సి.. నాకు కంగనాతో ప్రాబ్లమ్ లేదు.. ఆమెకే నాతో ప్రాబ్లమ్..

Taapsee talk about Kangana Ranaut issue

Taapsee Vs Kangana :  టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసిన తాప్సి అనంతరం బాలీవుడ్ లో ఛాన్స్ రావడం తో అక్కడికి చెక్కేసి బాలీవుడ్ లోనే సెటిల్ అయిపొయింది. ఇప్పుడు బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తుంది. ఈ మధ్య ఎక్కువగా ఇటీవల లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది తాప్సి. తాజాగా బాలీవుడ్ లో తాప్సి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఈ ఇంటర్వ్యూలో కంగనా ఇష్యూ గురించి కూడా మాట్లాడింది తాప్సి.

కొన్ని రోజుల క్రితం కంగనా, తాప్సి మధ్య వార్ నడిచిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరి కామెంట్స్ చేయడం, ఒకరి గురించి ఒకరు నెగిటివ్ గా మాట్లాడటం చేశారు. ఒకానొక టైంలో అయితే కంగనా, తాప్సి ట్విట్టర్ లోనే ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. వీళ్ళ గొడవ చూసి బాలీవుడ్ అంతా ఆశ్చర్యపోయింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా ఇష్యూ గురించి మాట్లాడింది తాప్సి.

Guneet Monga : ఆస్కార్ తో ఇండియాకి వచ్చిన నిర్మాత గునీత్ మోంగా.. ముంబైలో భారీ స్వాగతం..

తాప్సి మాట్లాడుతూ.. నాకు కంగనాతో ఏం ప్రాబ్లమ్ లేదు. గతంలో నేను బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేసరికి ఆమె ఇక్కడ హీరోయిన్. మొదట్లో కనపడితే హాయ్, హలో అని మామూలుగానే మాట్లాడాను. ఆమెకే నాతో ప్రాబ్లమ్ అనుకుంట. నా గురించి ఏం మాట్లాడిందో మీకు తెలుసు. చీప్ యాక్టర్ అని కూడా కామెంట్స్ చేసింది. నేను అవి ఇపుడు పట్టించుకోను. తాను నా గురించి మాట్లాడినప్పుడు మొదట షాక్ అయ్యాను. ఒక మంచి నటి ఇలా మాట్లాడిందా అని. ఇప్పుడు నేను అసలు ఆమెను పట్టించుకోవట్లేదు. ఒకవేళ ఎదురుపడితే పలకరిస్తాను అంతే. నాకైతే ఆమెతో ప్రాబ్లమ్ ఏమి లేదు. ఆమెకే నాతో ప్రాబ్లమ్ అనుకుంట అని అంది. దీంతో తాప్సి చేసిన వ్యాఖ్యలు మరోసారి బాలీవుడ్ లో వైరల్ గా మారాయి. మరి ఈ వ్యాఖ్యలపైన కంగనా స్పందిస్తుందేమో చూడాలి.