Guneet Monga : ఆస్కార్ తో ఇండియాకి వచ్చిన నిర్మాత గునీత్ మోంగా.. ముంబైలో భారీ స్వాగతం..

ది ఎలిఫెంట్ విష్పరర్స్ నిర్మాత గునీత్ మోంగా నేడు ఉదయం అమెరికా నుండి ముంబైకి వచ్చింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో నేడు ఉదయం ఆస్కార్ అవార్డు పట్టుకొని ఎంట్రీ ఇచ్చింది................

Guneet Monga : ఆస్కార్ తో ఇండియాకి వచ్చిన నిర్మాత గునీత్ మోంగా.. ముంబైలో భారీ స్వాగతం..

Guneet Monga return to India with her Oscar Award grand receiving at mumbai Airport

Updated On : March 18, 2023 / 7:01 AM IST

Guneet Monga : ఈ సారి 95వ ఆస్కార్ వేడుకల్లో మన ఇండియా నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డులు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండూ ఆస్కార్ సాధించడంతో సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఈ రెండు టీమ్స్ కి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ముగియడంతో ఆస్కార్ అందుకున్న వాళ్ళు ఒక్కొక్కరు తమ దేశాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఇటీవలే రెండు రోజుల క్రితం ఎన్టీఆర్, నేడు ఉదయం రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి, RRR టీం అంతా ఇండియాలో అడుగుపెట్టారు. ఇక ది ఎలిఫెంట్ విష్పరర్స్ నిర్మాత గునీత్ మోంగా నేడు ఉదయం అమెరికా నుండి ముంబైకి వచ్చింది.

Taapsee Pannu : వామ్మో.. తాప్సి ఆ ఒక్కరి కోసం నెలకు లక్ష రూపాయలు ఖర్చుపెడుతోందా?

ముంబై ఎయిర్ పోర్ట్ లో నేడు ఉదయం ఆస్కార్ అవార్డు పట్టుకొని ఎంట్రీ ఇచ్చింది. గునీత్ మోంగాకు ఎయిర్ పోర్ట్ వద్ద భారీ స్వాగతం లభించింది. పలువురు అభిమానులు, సినిమా టీం, మీడియా ఎయిర్ పోర్ట్ వద్ద సందడి చేశారు. ఆమెకు దండలు వేసి, డప్పులు కొట్టి, హారతి ఇచ్చి వెల్కమ్ చెప్పారు. గునీత్ మోంగా తన ఆస్కార్ అవార్డుతో అభివాదం చేసుకుంటూ వెళ్ళింది. అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేటగిరిలో మాతో పాటు ఉన్న సినిమాలు మాకు బాగా పోటీ ఇచ్చాయి. కానీ మా సినిమా అందర్నీ మెప్పించింది. ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపింది.