Akhanda : మా సౌండ్ బాక్సులు బద్ధలవుతున్నాయి.. ‘అఖండ’లో తమన్ వీర కొట్టుడు..

అఘోరాగా బాలయ్య సృష్టించిన విధ్వండానికి, బోయపాటి మాస్ ఎలివేషన్స్ కి తమన్ వీర కొట్టుడు మ్యూజిక్ తోడవటంతో థియేటర్స్ లో బాక్సులు బద్దలైపోతున్నాయని......

Akhanda :  మా సౌండ్ బాక్సులు బద్ధలవుతున్నాయి.. ‘అఖండ’లో తమన్ వీర కొట్టుడు..

Taman

Akhanda :  నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బెనిఫిట్ షో అయిపోవడంతో ఈ సినిమాతో బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ కొట్టారని అంటున్నారు ప్రేక్షకులు. సినిమా చూసిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడేది తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించే.

Bigg Boss : బిగ్‌బాస్ లోకి బన్నీ.. పీక్స్‌లో ‘పుష్ప’ ప్రమోషన్స్

ఇటీవల తమన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అన్ని సినిమాలకి సాంగ్స్ మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొడుతున్నాడు. తాజాగా ‘అఖండ’ సినిమాకి ఫుల్ మాస్ BGM కొట్టడంతో థియేటర్ లో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. అఘోరాగా బాలయ్య సృష్టించిన విధ్వండానికి, బోయపాటి మాస్ ఎలివేషన్స్ కి తమన్ వీర కొట్టుడు మ్యూజిక్ తోడవటంతో థియేటర్స్ లో బాక్సులు బద్దలైపోతున్నాయని అంటున్నారు. ఆ BGM వింటుంటే పూనకాలు వస్తున్నాయని అభిమానులు అంటున్నారు.

Puneeth Rajkumar : 22 ఏళ్ళ వివాహ బంధం.. ఇకపై పునీత్ జ్ఞాపకాల్లోనే

అయితే ఓ సినిమా థియేటర్ హాల్ బయట పెట్టిన ఓ నోటిస్ ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అఖండ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల మా స్పీకర్లు పగిలిపోయే ప్రమాదం ఉంది. తమన్ కొట్టిన మ్యూజిక్ ని తట్టుకోవడం మావల్ల కాదు అందుకే సౌండ్ కొంచెం తగ్గించి సినిమాని చుపిస్తాము అంటూ నోటీసులు పెట్టారు. ఈ నోటీసులు చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. సినిమా హాల్స్ ఈ రేంజ్ లో నోటీసులు పెట్టారంటే తమన్ ఏ లెవెల్ లో BGM కొట్టాడో అర్ధం చేసుకోవచ్చు.

Salman Khan : చిరంజీవి, వెంకటేష్ సినిమాల్లో నటించబోతున్నాను : సల్మాన్ ఖాన్

అమెరికాలోని సినీమార్క్ అనే మల్టిప్లెక్స్ ఈ నోటీసుని తమ థియేటర్ ముందు పెట్టింది. అమెరికాలోనే ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉంది అంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఆ థియేటర్ పెట్టిన నోటీసు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులంతో పాటు, సినిమా చూసిన ప్రేక్షకులు కూడా తమన్ మ్యూజిక్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.