Puneeth Rajkumar : 22 ఏళ్ళ వివాహ బంధం.. ఇకపై పునీత్ జ్ఞాపకాల్లోనే

నిన్నటికి పునీత్ పెళ్లి అయి 22 ఏళ్ళు పూర్తయింది. 1999 డిసెంబరు 1వ తేదీన అశ్వినిని పునీత్‌ ప్రేమించి పెళ్లాడారు. ప్రతి వివాహ వార్షికోత్సవాన్ని చాలా అందంగా జరుపుకునే.......

Puneeth Rajkumar : 22 ఏళ్ళ వివాహ బంధం.. ఇకపై పునీత్ జ్ఞాపకాల్లోనే

Puneeth

Updated On : December 2, 2021 / 11:45 AM IST

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణాన్ని కుటుంబ సభ్యులు, అభిమానులు, కన్నడ ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణించి నెల రోజుల పైగా అవుతున్నా ఇవాళ్టికి పునీత్ సమాధిని సందర్శించడానికి జనం బారులు తీరుతున్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Salman Khan : చిరంజీవి, వెంకటేష్ సినిమాల్లో నటించబోతున్నాను : సల్మాన్ ఖాన్

పునీత్ మరణం తర్వాత ఆయన భార్య అశ్విని అసలు బయటకు రాలేదు. పునీత్ కార్యక్రమాలకు తప్పించి ఇప్పటివరకు కూడా ఆమె మీడియాకి కనపడలేదు. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పునీత్ గురించి తలుచుకుంటూ ఆమె బాధని వ్యక్తపరుస్తూ, అభిమానులు చూపించే ప్రేమకి ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ పెట్టింది. అయితే నిన్నటికి పునీత్ పెళ్లి అయి 22 ఏళ్ళు పూర్తయింది. 1999 డిసెంబరు 1వ తేదీన అశ్వినిని పునీత్‌ ప్రేమించి పెళ్లాడారు. ప్రతి వివాహ వార్షికోత్సవాన్ని చాలా అందంగా జరుపుకునే వారు ఈ జంట. కానీ విధి మరోలా తలచడంతో ఈ 22వ వివాహ వార్షికోత్సవానికి పునీత్‌ లేరు. ఈ 22 ఏళ్ళ బంధాన్ని గుర్తు చేసుకొని అశ్విని మరింత బాధపడుతున్నారని కుటుంబ సభ్యుల సమాచారం. వీరి వివాహ వార్షికోత్సవాన్ని గుర్తు చేస్తూ ఇకపై ఆయన జ్ఞాపకాలతోనే జీవించాలి అంటూ నెటిజన్లు బాధపడుతూ కామెంట్లు చేస్తున్నారు.