Kumbha Rasi Phalalu 2026 : కుంభ రాశి వారు ఈ ఒక్క పని చేస్తే.. ఈ సంవత్సరం అద్భుతమైన విజయాలు మీ సొంతం..!
Kumbha Rasi Phalalu 2026 : ఈ ఉగాది నుంచి కుంభ రాశి వారికి అద్భుతమైన విజయాలు లభిస్తాయని.. అలా జరగాలంటే వారు ఓ పని చేయాలని సూచిస్తున్నారు.
ugadi panchangam sri parabhava nama samvatsara 2026 2027 kumbha rasi phalalu Aquarius horoscope
Kumbha Rasi Phalalu 2026 : కుంభ రాశి వారికి ఈ ఉగాది నుంచి అకారణ కలహాలకు దూరంగా ఉండి సహనంతో వ్యవహరిస్తే.. ఈ సంవత్సరం అద్భుతమైన విజయాలు వారి సొంతం అంటున్నారు పండితులు. అహంకారం వదిలిపెట్టి అందరినీ కలుపుకుని వెళ్తే.. కుంభ రాశి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని తెలిపారు. ప్రారంభించిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా ఆఖరికి మీరే విజయం సాధిస్తారని తెలిపారు. విలువైన వస్తువులు, నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ధనం ఖర్చవుతుందంటున్నారు. పెళ్లి సంబంధాలు ఆలస్యం అయినా మంచి సంబంధం కుదురుతుందని చెబుతున్నారు.
విద్యార్థులు సెల్ ఫోన్, టీవీ వంటి వాటికి దూరంగా ఉంటే మంచి మార్కులు సాధిస్తారని.. ఉద్యోగులు పై అధికారులతో విభేదాలకు పోకుండా బాధ్యతలు నిర్వర్తిస్తే ప్రమోషన్ వస్తుందంటున్నారు. వ్యాపారస్తులకు, అన్నదాతలకు, రాజకీయ నాయకులకు, క్రీడాకారులు, కళాకారులు, స్త్రీలు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయంటున్నారు.
ఆదాయం: 2, వ్యయం: 8, రాజపూజ్యం: 4, అవమానం: 2
నక్షత్రాల వారీగా అదృష్ట సమయం
- నక్షత్రం కలిసివచ్చే నెలలు అదృష్ట వారాలు సంఖ్యలు
- ధనిష్ట (3,4 పాదాలు) ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి (2027) సోమ, గురు, శని 2, 3, 4, 7
- శతభిషం (1-4 పాదాలు) ఏప్రిల్, మే, సెప్టెంబర్, జనవరి (2027) ఆది, మంగళ, బుధ 4, 5, 8
- పూర్వాభాద్ర (1,2,3 పాదాలు) మే, సెప్టెంబర్, అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి (2027) సోమ, గురు, శని 2, 3, 7, 9
పరిహారాలు-పూజలు:
- ఉగాది తర్వాత శని, రాహు, గురు గ్రహాలకు జపాలు చేయించి నువ్వులు, మినుములు, శెనగలు దానం ఇవ్వాలి.
- క్షేత్ర దర్శనం: పంచారామ క్షేత్రాలను దర్శించుకోవడం విశేష ఫలితాలనిస్తుంది. అయ్యప్ప స్వామి, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి దర్శనం మంచిది.
- స్తోత్ర పఠనం: ప్రతిరోజూ అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి పనులు సులభంగా పూర్తవుతాయి.
- గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడమైనది.
