Tamil Directors: పెద్ద సినిమాల్ని హ్యాండిల్ చెయ్యలేకపోతున్న యంగ్ డైరెక్టర్లు

తెలుగులోనే కాదు.. ఏ ఇండస్ట్రీ అయినా.. పెద్ద స్టార్లను, భారీ బడ్జెట్ సినిమాల్ని చెయ్యడం అంత ఈజీ కాదు. తెలుగు, తమిళ్ ఇలా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా సరిగా ఎగ్జిక్యూట్..

Tamil Directors: పెద్ద సినిమాల్ని హ్యాండిల్ చెయ్యలేకపోతున్న యంగ్ డైరెక్టర్లు

Tamil Directors

Young Directors: తెలుగులోనే కాదు.. ఏ ఇండస్ట్రీ అయినా.. పెద్ద స్టార్లను, భారీ బడ్జెట్ సినిమాల్ని చెయ్యడం అంత ఈజీ కాదు. తెలుగు, తమిళ్ ఇలా భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా అయినా సరిగా ఎగ్జిక్యూట్ కాకపోతే గ్యారంటీగా ఫ్లాప్ అవుతుంది. స్పెషల్లీ పెద్ద సినిమాల విషయంలో యంగ్ డైరెక్టర్లకు ఛాన్సొస్తున్నా కానీ.. అంతగా భారీ సినిమాల్ని హ్యాండిల్ చెయ్యలేక డిజాస్టర్లు ఫేస్ చేస్తున్నారు.

Tamil Directors : తెలుగు ఇండస్ట్రీలో తమిళ్ డైరెక్టర్లు.. అందరూ హైదరాబాద్‌లోనే..

హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాని తమిళ్ లో యాజ్ ఇట్ ఈజ్ గా తీసి మంచి హిట్ అందుకున్నారు డైరెక్టర్ హెచ్. వినోత్. ఇదే సక్సెస్ స్పీడ్ లో అజిత్ తో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని వలిమైగా తెరకెక్కించారు. రేసింగ్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో కార్తికేయ విలన్ గా తెరకెక్కిన వలిమైలో అజిత్ ఇమేజ్ ని గ్రాబ్ చెయ్యడంలో మిస్ ఫైర్ అయ్యారు వినోత్. దాంతో భారీ యాక్షన్ టైనర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన వలిమై ఫ్లాప్ మూటకట్టుకుంది.

Telugu Directors: హిట్టు కొట్టినా కొత్త సినిమా పట్టాలెక్కించలేని దర్శకులు!

స్టార్ హీరో రజనీకాంత్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అంటే అంత ఈజీ కాదు. అలాంటిది యంగ్ డైరెక్టర్ శివకు అలాంటి ఛాన్సిచ్చారు రజనీకాంత్. భారీ స్టార్ కాస్ట్ తో శివ డైరెక్షన్లో తెరకెక్కిన పెద్దన్న మూవీ లుక్స్ తోనే ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేశారు తలైవా. కీర్తిసురేష్, ఖుష్బూ, మీనా లీడ్ రోల్స్ తో భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న రజనీకాంత్ కి హిట్ ఇవ్వలేకపోయాడు శివ.

Kollywood Stars: టాలీవుడ్‌లో పాగా వేసేందుకు తమిళ తంబీల ప్లాన్స్!

అంతకుముందు చిన్న సినిమాలు చేసి.. స్టార్ హీరో సూర్యతో పెద్ద సినిమా ఆఫర్ దక్కించుకున్న ఇంట్రస్టింగ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కూడా ఈ సినిమా ఛాన్స్ ని యూజ్ చేసుకోలేకపోయారు. సూర్య, సెల్వ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఎన్జీకే.. అంచనాల్ని అందుకోలేక, సూర్య ఫాన్స్ పల్స్ పట్టుకోలేక డిజాస్టర్ ఫేస్ చేసింది.

Star Actress: ఈడా ఉంటాం.. ఆడా ఉంటాం.. ఎక్కడైనా ఒకే అంటున్న స్టార్ బ్యూటీస్!

తమిళ్ లో మరో సూపర్ స్టార్ విజయ్ ఫస్ట్ టైమ్ ఫోక్లోర్ కాన్పెప్ట్ లో తెరకెక్కించిన సినిమా పులి. అప్పటి వరకూ స్క్రీన్ రైటర్ గా చిన్న సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసి చింబుదేవన్ విజయ్ తో భారీ స్టార్ కాస్ట్ తో బిగ్ బడ్జెట్ తో పులి సినిమా తెరకెక్కించారు. బాహుబలి టైమ్ లోనే తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీదేవి సౌత్ కి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నా ఎగ్జిక్యూషన్ సరిగా లేక బిగ్ డిజాస్టర్ అయ్యింది.