Kollywood Stars: టాలీవుడ్‌లో పాగా వేసేందుకు తమిళ తంబీల ప్లాన్స్!

టాలీవుడ్ లో తమిళ్ స్టార్ హీరోల దండయాత్ర మొదలైంది. ఇక్కడి యంగ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడక్షన్ హౌజెస్ ను సెట్ చేసుకుని గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్లకి అక్కడ డైరెక్టర్స్ కనిపించడం..

Kollywood Stars: టాలీవుడ్‌లో పాగా వేసేందుకు తమిళ తంబీల ప్లాన్స్!

Kollywood Stars

Kollywood Stars: టాలీవుడ్ లో తమిళ్ స్టార్ హీరోల దండయాత్ర మొదలైంది. ఇక్కడి యంగ్ డైరెక్టర్స్, బిగ్ ప్రొడక్షన్ హౌజెస్ ను సెట్ చేసుకుని గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్లకి అక్కడ డైరెక్టర్స్ కనిపించడం లేదా.. వీళ్లకిక్కడ హీరోలు దొరకట్లేదా అంటే.. కోలీవుడ్ హీరో – టాలీవుడ్ డైరెక్టర్ రొంబ కాంబినేషన్ అంటున్నారు మేకర్స్. డబ్బింగ్ సినిమాలతో తమిళ్ హీరోలు మన ఆడియెన్స్ కు ఎప్పటినుంచో పరిచయమే. కంటెంట్ బాగుంటే తమిళ్ డబ్బింగ్ సినిమాలు మన దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టినవి చాలానే ఉన్నాయి.

Film Controversies: మనోభావాలు దెబ్బతింటున్నాయ్.. కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయ్!

అసలొకప్పుడు డబ్బింగ్ పాటలదే హవా నడిచిందిక్కడ. కొందరు స్టార్స్ తెలుగు సినిమాల్లో నటించారు కూడా. అయితే సడెన్ గా సీన్ మారిపోయింది. స్టైయిట్ తెలుగు సినిమా చేయాలని కలలు కంటున్నారు కోలీవుడ్ హీరోలు. తెలుగులో ఫేమ్ ఉన్న డైరెక్టర్స్ తో, పెద్ద ప్రొడక్షన్ హౌజ్ లతో డీల్ మాట్లాడుకుంటున్నారు. మన హీరోలు పాన్ ఇండియా బాట పట్టడం, కేవలం స్టార్ డైరెక్టర్స్ నే టార్గెట్ చేయడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ క్రేజ్ ఉన్న తమిళ్ హీరోలకి కథలు చెప్పేస్తున్నారు.

Pushpa-Samantha: సామ్ ఊ అంటావా.. ఫుల్ సాంగ్ వచ్చేసింది!

ధనుశ్ – వెంకీ అట్లూరి సినిమా లాంచ్ అయిపోయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ధనుశ్ హీరోగా సార్ సినిమాను పట్టాలెక్కించింది. ధనుశ్ నేషనల్ యాక్టర్. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న స్టార్. బాలీవుడ్ లో రాంజనా మూవీతో ఎంట్రీ ఇచ్చి రీసెంట్ గా ఆత్రాంగిరే చూపించాడు. అయితే తెలుగు ప్రేక్షకులతో మావాడు అనిపించుకుంటే ఆ క్రేజ్ వేరు. అందుకే డైరెక్ట్ గా తెలుగు సినిమా సార్ చేసేస్తున్నాడు. ఇక మార్చి నుంచి శేఖర్ కమ్ముల – ధనుశ్ కాంబో మూవీ కూడా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అంటే ఒకేసారి ఇద్దరు తెలుగు డైరెక్టర్స్ తో పని కానిస్తున్నాడు రజనీ అల్లుడు.

South Stars: బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్న లోకల్ స్టార్స్!

శివ కార్తీకేయన్.. ఈమద్యే డాక్టర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. త్వరగా తెరుకొని తన 20వ సినిమానే తెలుగు డైరెక్టర్ తో చేయబోతున్నాడు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో శివ కార్తీకేయన్ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ మూవీని ఏకంగా ముగ్గురు బడా నిర్మాతలు నిర్మించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ సంయుక్తంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం శివకార్తికేయన్ ఏకంగా 37కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడనే వార్తలొస్తున్నాయి.

Major: మేజర్ నుంచి ప్రేమ గీతం.. సిద్ శ్రీరామ్ మరో మ్యాజికల్!

నిజానికి ఫస్ట్ ఇనిషియేట్ తీసుకుంది తళపతి విజయ్. విజయ్ తెలుగు మూవీ ప్రకటించిన తర్వాతే మిగిలిన వాళ్లు ఒక్కొక్కరుగా ముందుకొచ్చారు. తమిళ్ ఎంట్రీ ఇచ్చి దశాబ్దాలు గడుస్తోన్న ఎప్పుడూ తెలుగు సినిమా చేయలనుకోలేదు విజయ్. డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు కనిపించేవాడు. అయితే మారుతున్న లెక్కలు, మార్కెట్ పెంచుకోవాలనే ఆశలు, పాన్ ఇండియా ఫోజలు అన్నీ విజయ్ ని మార్చేశాయి. వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబోలో విజయ్ తన 66వ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. బీస్ట్ పని మొత్తం పూర్తయ్యాక వంశీ పైడిపల్లితో సెట్స్ పైకెళ్తాడు విజయ్. అయితే ఈ సినిమాకే ఈ హీరో 100 కోట్లు అందుకుంటున్నాడనే వార్తలొచ్చాయి.

Shraddha Das: శ్రద్దా చిల్లవుట్.. కుర్రాళ్ళకి గ్లామర్ ట్రీట్!

ఎప్పుడో తెలుగు ప్రేక్షకుల్లో ఇంపాక్ట్ చూపించిన సూర్య, కార్తీ లాంటి హీరోలు ఆల్రెడీ తెలుగు డైరెక్ట్ సినిమాలు చేశారు. రక్త చరిత్ర 2తో సూర్య, ఊపిరితో కార్తీ డెరెక్ట్ గానే పలకరించారు. అయితే వీళ్లు ఈసారి మరింత గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా సూర్య, బోయపాటి శ్రీను కాంబో ఖచ్చితంగా పట్టాలెక్కుతుందనే హింట్స్ అందుతున్నాయి.