South Stars: బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్న లోకల్ స్టార్స్!

రీజనల్, పాన్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్ మధ్య బౌండరీస్ చెరిగిపోతున్నాయి. ఇప్పటికే సౌత్ నుంచి చాలా మంది పాన్ ఇండియా స్టార్స్ అయిపోతున్నారు. ఈ సంవత్సరం టాప్ రీజనల్ స్టార్స్ బాలీవుడ్ కి..

South Stars: బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్న లోకల్ స్టార్స్!

South Stars

South Stars: రీజనల్, పాన్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్ మధ్య బౌండరీస్ చెరిగిపోతున్నాయి. ఇప్పటికే సౌత్ నుంచి చాలా మంది పాన్ ఇండియా స్టార్స్ అయిపోతున్నారు. ఈ సంవత్సరం టాప్ రీజనల్ స్టార్స్ బాలీవుడ్ కి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు. బాహుబలి నుంచే రీజనల్, పాన్ ఇండియా అన్న లైన్ చెరిగిపోయింది. అందుకే ఇప్పుడు స్టార్లందరూ రీజనల్ ట్యాగ్ వదిలేసి.. పాన్ ఇండియా రేంజ్ హీరోలుగా అవతరిస్తున్నారు. ఈ సంవత్సరంలో డైరెక్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు కొంతమంది టాప్ రీజనల్ స్టార్స్.

Sankranti Movies: హ్యండిచ్చిన స్టార్ హీరోలు.. థియేటర్లపై ఛోటా హీరోల దండయాత్ర!

ఆ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది అన్ డౌటెడ్ లీ ప్రభాస్. బాహుబలి, సాహో లాంటి మెగా బడ్జెట్ మూవీస్ తో బాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయిన ప్రభాస్.. ఈ సంవత్సరం.. డైరెక్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలతో బాలీవుడ్ మార్కెట్ ని స్ట్రెన్తెన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్.

NBK 107: పక్కా ప్లాన్.. హీరో, విలన్ తప్ప మిగతాదంతా సేమ్ టూ సేమ్

మరో రీజనల్ టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా 2022లో పాన్ ఇండియా మార్కెట్ కి పరిచయం అవుతున్నారు. పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న లైగర్ మూవీ తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు విజయ్ దేవరకొండ. మైక్ టైసన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ హిందీతో పాటు అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతోంది.

83 Movie: కమర్షియల్ అట్టర్ ప్లాప్ ’83’.. స్పోర్ట్స్ డ్రామాల పనైపోయినట్లేనా?

20 సంవత్సరాలకు పైగా కెరీర్లో ఫస్ట్ టైమ్ బాలీవుడ్ వైపు చూస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఉన్న ఎన్టీఆర్.. రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న ట్రిపుల్ఆర్ మూవీతో 2022లో బాలీవుడ్ ఎంట్రీ కొట్టబోతున్నారు. జనవరి 7న రిలీజ్ అవ్వాల్సి పోస్ట్ పోన్ అయిన ట్రిపుల్ఆర్ మూవీలో అజయ్ దేవ్ గన్, ఆలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ తో పాటు ఎన్టీఆర్ హిందీ ఆడియన్స్ ని ఆకట్టుకోబోతున్నారు.

Krithi Shetty: 6 నెలల్లో 5 సినిమాలు.. బేబమ్మ బిజీబిజీ!

టాలీవుడ్ కి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ హీరో నాగచైతన్య కూడా 2022లో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న రీమేక్ మూవీ లాల్ సింగ్ చడ్హాలో ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ లో బాలీవుడ్ ని ఎంటర్ టైన్ చెయ్యబోతున్నారు నాగచైతన్య. లాల్ సింగ్ చడ్హా ఏప్రిల్ 14న ధియేటర్లోకి రాబోతోంది.

VinaroBhagyamuVishnuKatha: కిరణ్ అబ్బవరం కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్ టైటిల్!

సౌత్ కి సంబంధించిన ఆ మరో రీజనల్ స్టార్ విజయ్ సేతుపతి కూడా డైరెక్ట్ బాలీవుడ్ అరంగేట్రానికి రెడీ అయ్యారు. డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తూ.. ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న విజయ్ సేతుపతి.. హిందీలో ముంబైకర్, మెర్రీ క్రిస్ మస్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తో 2022లో బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారు. మెర్రీక్రిస్ మస్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

S.Thaman: టాలీవుడ్‌లో కరోనా కలకలం.. థమన్‌కి పాజిటివ్!

రీజనల్ స్టార్స్ లో హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా బాలీవుడ్ మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ పుష్పతో పాటు టాప్ టక్కర్ లాంటి ఆల్బమ్స్ తో బాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయిన రష్మిక మందాన, బాలీవుడ్ లో డైరెక్ట్ మూవీస్ చేస్తోంది. అమితాబ్ బచ్చన్ తో గుడ్ బై సినిమా తో పాటు.. సిద్దార్ధ్ మల్హోత్రాతో మిషన్ మజ్నులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే తమిళ్, కన్నడ, తెలుగులో బిజీగా ఉన్న రష్మిక డైరెక్ట్ హిందీ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తోంది.