NBK 107: పక్కా ప్లాన్.. హీరో, విలన్ తప్ప మిగతాదంతా సేమ్ టూ సేమ్

క్రాక్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మలినేని గోపీచంద్ మాంచి ఊపుమీదున్నారు. అందుకే బాలయ్య సినిమా బాగా కాన్సన్ ట్రేట్ చేసి మరో హిట్ కొడదామని పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారు.

NBK 107: పక్కా ప్లాన్.. హీరో, విలన్ తప్ప మిగతాదంతా సేమ్ టూ సేమ్

Nbk 107

NBK 107: క్రాక్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మలినేని గోపీచంద్ మాంచి ఊపుమీదున్నారు. అందుకే బాలయ్య సినిమా బాగా కాన్సన్ ట్రేట్ చేసి మరో హిట్ కొడదామని పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమా మెయిన్ స్టార్ కాస్ట్ ని అనౌన్స్ చేసిన గోపీచంద్.. హీరో, విలన్ కాకుండా మిగతాదంతా సేమ్ టూ సేమ్ ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతోంది. బాలయ్య 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది.

83 Movie: కమర్షియల్ అట్టర్ ప్లాప్ ’83’.. స్పోర్ట్స్ డ్రామాల పనైపోయినట్లేనా?

ఇప్పటికే స్టార్ కాస్ట్ రివీల్ చేసిన గోపీచంద్.. క్రాక్ టీమ్ నే రిపీట్ చేస్తున్నారు. క్రాక్ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆ సినిమా టీమ్ ని రిపీట్ చేస్తున్నారు గోపీచంద్. మొన్నీమధ్యనే విలన్ గా మరో కన్నడ స్టార్ దునియా విజయ్ ని ఫిక్స్ చేసింది టీమ్. లేటెస్ట్ గా క్రాక్ లో జయమ్మ క్యారెక్టర్ చేసిన వరలక్ష్మీ శరత్ కుమార్.. బాలయ్య సినిమాలో కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే క్రాక్ లో చేసిన శృతి హాసన్ నే బాలయ్య పక్కన హీరోయిన్ గా రిపీట్ చేస్తున్నారు.

Krithi Shetty: 6 నెలల్లో 5 సినిమాలు.. బేబమ్మ బిజీబిజీ!

స్టార్ కాస్టే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని కూడా మరోసారి రిపీట్ చేశారు గోపీచంద్. క్రాక్ తో అదిరిపోయే హిట్ ఇచ్చిన థమన్ నే గోపీచంద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేశారు. క్రాక్ కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు బాలయ్యతో గోపీచంద్ చెయ్యబోయే సినిమా కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈసినిమా గురించి బాగా సెర్చ్ చేసిన గోపీచంద్.. పకడ్భందీగా సెట్స్ మీదకి తీసుకెళ్లబోతున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.