Film Controversies: మనోభావాలు దెబ్బతింటున్నాయ్.. కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయ్!

టాలీవుడ్ సినిమాలు ఈ మధ్య సక్సెస్ తోనే కాదు.. కాంట్రవర్సీలతో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఎక్కడో ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుని న్యూస్ లో..

Film Controversies: మనోభావాలు దెబ్బతింటున్నాయ్.. కాంట్రవర్సీలు పుట్టుకొస్తున్నాయ్!

Film Controversies

Film Controversies: టాలీవుడ్ సినిమాలు ఈ మధ్య సక్సెస్ తోనే కాదు.. కాంట్రవర్సీలతో కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా ఎక్కడో ఏదో ఒక ఇష్యూలో ఇరుక్కుని న్యూస్ లో నిలుస్తోంది. లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్, ఆచార్య కూడా ఇలాంటి ఇష్యూతో ఇబ్బంది పడుతున్నాయి. టాలీవుడ్ సినిమాలు కాంటవర్సీ అవుతున్నాయి. ఒకప్పుడు సినిమాలు కాంట్రవర్సీ అయితే పబ్లిసిటీ స్టంటేమో అనుకనేవాళ్లు.. కానీ ఇప్పుడు ప్రతి చిన్న దానికి కాంట్రవర్సీ చేస్తూ.. సినిమాల్ని కోర్టుకీడుస్తున్నారు కొంతమంది.

Sankranti Movies: హ్యండిచ్చిన స్టార్ హీరోలు.. థియేటర్లపై ఛోటా హీరోల దండయాత్ర!

లేటెస్ట్ గా మెగాస్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరు స్టార్ హీరోలు నటించి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాలశివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్టార్ స్టడెడ్ మూవీ ఆచార్యని కాంట్రవర్సీలోకి లాగారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన శానా కష్టం పాటలో లిరిక్ కి.. ఆర్ ఎమ్పీల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు.. డైరెక్టర్ మీద చర్యలు తీస్కోవాలని, అసలు పాట సినిమా నుంచి తీసెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

NBK 107: పక్కా ప్లాన్.. హీరో, విలన్ తప్ప మిగతాదంతా సేమ్ టూ సేమ్

రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ట్రిపుల్ఆర్ చుట్టూ కూడా కాంట్రవర్సీ మొదలైంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ క్యారెక్టర్లలో నటిస్తున్న ఈ సినిమా చరిత్రను వక్రీకరించిందంటూ కోర్టులో పిల్ వేశారు. అంతేకాదు.. దీనివల్ల్ కొమరంభీమ్, అల్లూరి సీతారామరాజు అభిమానులు హర్ట్ అవుతారని, సినిమా సెన్సార్ పర్మిషన్ ఇవ్వొద్దని, సినిమా మీద స్టే ఇవ్వాలంటూ కోర్టుకెక్కారు.

83 Movie: కమర్షియల్ అట్టర్ ప్లాప్ ’83’.. స్పోర్ట్స్ డ్రామాల పనైపోయినట్లేనా?

ఈ సినిమాల మీదే కాదు.. డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప సినిమా మీద కూడా కాంట్రవర్సీ చేశారు కొంతమంది. సమంత స్పెషల్ సాంగ్ ఊ అంటావా.. ఊఊ అంటావా మీద కూడా ఓరేంజ్ లో కాంట్రవర్సీ జరిగింది. ఈ పాటలో లిరిక్స్ కి పురుషుల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.. సినిమాలో నుంచి ఈ పాట తీసెయ్యాలంటూ గొడవ చేసింది. ఇలా ఈ మధ్య స్టార్ సినిమాలకు కూడా కాంట్రవర్సీ తప్పడం లేదు.