Sankranti Release: సీన్ రివర్స్.. పెద్ద పండగకి చిన్న సినిమాల హడావుడి!

2022 సంక్రాంతి స్టార్ సినిమాలతో సందడే అనుకున్నారు అంతా. కానీ సీన్ రివర్స్ అయ్యింది. సర్కారువారిపాట, భీమ్లానాయక్, ట్రిపుల్ఆర్ పోస్ట్ పోన్ తో పాటు రాధేశ్యామ్ రిలీజ్ డైలమాతో ..

Sankranti Release: సీన్ రివర్స్.. పెద్ద పండగకి చిన్న సినిమాల హడావుడి!

Sankranti Release

Sankranti Release: 2022 సంక్రాంతి స్టార్ సినిమాలతో సందడే అనుకున్నారు అంతా. కానీ సీన్ రివర్స్ అయ్యింది. సర్కారువారిపాట, భీమ్లానాయక్, ట్రిపుల్ఆర్ పోస్ట్ పోన్ తో పాటు రాధేశ్యామ్ రిలీజ్ డైలమాతో చిన్న సినిమాలు వరసగా సంక్రాంతి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. ఈ సంక్రాంతి పెద్ద సినిమాలు లేవంటూ చిన్న సినిమాలు హడావిడి మొదలుపెట్టేశాయి. వరసగా పెద్ద సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవడంతో సడెన్ గా సీన్ లోకి చిన్న సినిమాలు వచ్చేశాయి. దాదాపుగా 10 సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి.

Daniel Craig: జేమ్స్ బాండ్‌కి బుద్దుందా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

అందరిలోకి ముందుగా ఆదిసాయికుమార్ అతిధి దేవో భవ సినిమా జనవరి 7న సీజన్ లోనే ఫస్ట్ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. సంక్రాంతికే రిలీజ్ అని ఫస్ట్ నుంచి అంటున్న బంగార్రాజు.. మొన్నీమధ్యనే సంక్రాంతికి వస్తున్నామంటూ టీజర్ తో అఫీషియల్ కన్ ఫర్మేషన్ ఇచ్చారు. నాగార్జున, నాగచైతన్య క్రేజీ కాంబినేషన్లో వస్తున్న బంగార్రాజు సంక్రాతికి సందడి చెయ్యబోతోంది. బంగార్రాజు ముందో, వెనకో వస్తాడనుకున్నా.. అసలు ఏమాత్రం ఊహించిన సినిమాలు సంక్రాంతి రేస్ లోకి వచ్చేశాయి. లేటెస్ట్ గా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డి.జె టిల్లు జనవరి 14న రిలీజ్ అవుతోంది.

Siri-Shanmukh: బాధలో దీప్తి.. జెస్సీ, సిరితో షన్ను ఎంజాయ్‌మెంట్!

అశోక్ గల్లా హీరోగా తెరకెక్కిన హీరో మూవీ కూడా సంక్రాంతి రేస్ లో కే వచ్చేసింది. సెవనె డేట్.. సిక్స్ నైట్స్ అనే ఇంట్రస్టింగ్ మూవీతో పాటు.. డిసెంబర్ 31 అని రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రానా 1945 కూడా డేట్ పోస్ట్ పోన్ చేసుకుని సంక్రాంతి కే రిలీజ్ అవుతోంది. ఇక దిల్ రాజు వారసుడు అశిష్ కూడా సంక్రాంతికే తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుంటున్నాడు. అసలు ఈమధ్య న్యూస్ లో కూడా లేని చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి మూవీ పెద్ద పండక్కే రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇలా పెద్ద సినిమాలు సైడైపోవడంతో చిన్న సినిమాలు సంక్రాంతికి మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చి రిలీజ్ హడావిడి మొదలుపెట్టేశాయి.